Actress Laya: రిస్కీ స్కైడైవింగ్ చేసిన నటి లయ.. వైరల్ అవుతున్న వీడియో..

‘స్వయంవరం’ మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి, పక్కింటమ్మాయి తరహా క్యారెక్టర్లతో తెలుగు ప్రేక్షకులను అలరించడే కాకుండా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది విజయవాడ అమ్మాయి లయ. తర్వాత పలు చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. హీరోయిన్‌గా మంచి పొజిషన్లో ఉండగానే అమెరికాలో సెటిల్ అయిన డాక్టర్ శ్రీ గణేష్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతో పాటు అక్కడే స్థిర పడిపోయింది. వీరికి ఓ పాప, బాబు సంతానం. రవితేజ ‘అమర్ అక్బర్ ఆంటోని’ మూవీతో తనలానే పిల్లలిద్దర్నీ బాలనటులుగా పరిచయం చేస్తూ..

తను కూడా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.. సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగిన లయ.. అమెరికాలో సెటిల్ అయినా కానీ మన ట్రెడిషన్‌ని మర్చిపోలేదు. ఎప్పటికప్పుడు లేటెస్ట్ పిక్స్, రీల్స్‌తో సందడి చేస్తుండే లయ.. ఇప్పుడు ఫస్ట్ టైమ్ స్కైడైవింగ్ చేసిన వీడియోను షేర్ చేసింది. పక్షిలా మారిపోయి ఆకాశంలో విహరిస్తూ స్కూడైవింగ్ చేయడం అనేది రిస్కీ అయినప్పటికీ థ్రిల్లింగ్‌గా ఉంటుందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus