Laya: లయ రీఎంట్రీ ఇవ్వనున్నారా… ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసిన నటి!

ఒకప్పుడు ఎన్నో తెలుగు సినిమాలలో ఎలాంటి గ్లామర్ షో లేకుండా నటిస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటి లయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్వయంవరం సినిమాతో కథానాయకగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించి మెప్పించారు. అయితే పెళ్లి తర్వాత ఈమె పూర్తిగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత కేవలం తన ఫ్యామిలీకి మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా ఇండస్ట్రీకి దూరమైనటువంటి లయ తన ఫ్యామిలీతో కలిసి అమెరికాలో నివసిస్తున్నారు.

ఇకపోతే ఈమధ్య కాలంలో ఎంతోమంది సీనియర్ సెలబ్రిటీలు తిరిగి రీ ఎంట్రీ ఇస్తూ తమ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఎంతో బిజీగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే లయ సైతం రీ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని చాలామంది భావిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ తరచూ డాన్స్ రీల్స్ చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలోషేర్ చేస్తూ ఉంటారు. అదే విధంగా తనకు సంబంధించిన అన్ని విషయాలను తన ఫ్యామిలీ ఫోటోలను కూడా ఈమె అభిమానులతో పంచుకుంటారు.

ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే లయ తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఆమె తన సినీ కెరియర్ గురించి మాట్లాడుతూ పలు విషయాలను తెలియచేశారు. అదేవిధంగా తన హోమ్ టూర్ వీడియోని కూడా చేశారు. ఇందులో భాగంగా తనుకు వచ్చినటువంటి అవార్డులను చూపించారు.

ఇప్పటివరకు ఈమెకు మూడు నంది అవార్డులు వచ్చాయని అయితే వాటిని త్వరలోనే అమెరికాకు తనతో పాటు తీసుకు వెళ్ళబోతున్నానని తెలిపారు.60 సినిమాలు వరకు నటించగా అందులో 40 సినిమాలు తెలుగులో చేశానని తెలిపారు. ఇక మంచి అవకాశాలు కనుక వస్తే రీ ఎంట్రీ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా లయ తెలిపారు.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus