Actress Laya: సీనియర్ స్టార్ హీరోయిన్ లయ బ్యూటిఫుల్ శారీ పిక్స్ వైరల్..!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ లయను అంత ఈజీగా ఎవరూ మర్చిపోలేరు. ‘భద్రం కొడుకో’ అనే చిన్న పిల్లల చిత్రంతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈమె ‘స్వయంవరం’ తో హీరోయిన్ గా మారి తొలి చిత్రంతోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది. అటు తర్వాత ‘మనోహరం’ ‘ప్రేమించు’ ‘దేవుళ్ళు’ ‘హనుమాన్ జంక్షన్’ ‘శివ రామ రాజు’ ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ ఇలా అన్నీ పేరు తెచ్చిపెట్టే చిత్రాలే చేసి సూపర్ హిట్లు అందుకుంది…

స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే బాలకృష్ణతో చేసిన ‘విజయేంద్ర వర్మ’ తర్వాత ఈమెను ప్లాపులు వెంటాడాయి. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ హిట్ అవ్వకపోవడం వల్ల ఈమె సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఓ ఎన్నారై ను పెళ్ళి చేసుకుని విదేశాల్లో సెటిల్ అయ్యింది. ప్రస్తుతం లయ లాస్ ఏంజెల్స్ లో ఉంది. ఈమె భర్త బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ…తన పిల్లల ఆలనా పాలనా చూసుకుంటూ ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది.

రవితేజ- శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘అమర్ అక్బర్ ఆంటోని’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది కానీ అది ప్లాప్ అవ్వడంతో ఈమె రీ ఎంట్రీ వర్కౌట్ అవ్వలేదు. ఎన్టీఆర్- త్రివిక్రమ్ ల ‘అరవింద సమేత’ లో ఛాన్స్ వస్తే పాత్ర నచ్చలేదు అని రిజెక్ట్ చేసింది.ఇప్పుడు రీ రీ ఎంట్రీ కోసం ఎదురుచూస్తూ.. తన ఇన్స్టాగ్రామ్ లో డాన్స్ వీడియోలు షేర్ చేస్తుంది.

తాజాగా ఈమె పోస్ట్ చేసిన శారీ పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ చీరలో ఆమె ‘గుండెల్లోనా గుండెల్లోనా’ అంటూ ‘ఓరి దేవుడా’ సినిమాలోని పాటలో స్టెప్పులు వేసింది. ఆ ఫోటోలు, వీడియో మీరు కూడా ఓ లుక్కేయండి :

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus