నటి, రాజకీయ నాయకురాలు మాధవీలత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముక్కుసూటిగా మాట్లాడుతూ, అనుకున్నది అనుకున్నట్లుగా చెప్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉండడం తెలిసిందే. నచ్చావులే మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన మాధవీలత రాజకీయాల్లోనూ యాక్టివ్ గా ఉంటుంది. కొంతకాలంగా మాధవీలత మీడియాకు దూరంగా ఉంది. ఇప్పుడు మళ్లీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో యాంకర్ ఈమధ్య భగవంత్ కేసరి మూవీలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి హీరో బాలకృష్ణ ఒక సన్నివేశంలో స్పీచ్ ఇస్తారు.
ఒక పెద్ద మూవీలో ఒక పెద్ద హీరో నుంచి అలాంటి మెసేజ్ కనుక వస్తే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. అందువల్ల ప్రయోజనం ఉంటుంది. ఒక మేల్ క్యారెక్టర్ నుండి అలాంటివి రావడం అనేదాన్ని మీరేలా తీసుకుంటారని అడిగారు. ఆ ప్రశ్నకు మాధవీలత “నేను ఇంకా ఆ సినిమా చూడలేదు’’ అని అన్నారు. ఆ తరువాత భగవంత్ కేసరి మూవీలో గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి మాట్లాడుతూ ‘హీరోల ద్వారా చెప్పించడం చాలా సంతోషం.
ఆ సినిమా కాన్సెప్ట్ అంతా కూడా ఎక్కడా హీరోయిన్ క్యారెక్టర్ ని గ్లామర్‌కే పరిమితం చేసి, హీరోతో డైలాగులు చెప్పిస్తే మాత్రం, చేసేది శివ పూజలు దూరేది ఇంకేదో అన్నట్టు ఉంటుంది. అలా కాకుండా హీరోయిన్ పాత్ర చాలా రెస్పెక్టెడ్‌గా ఉంటే, నేనైతే విన్నా శ్రీలీల పాత్ర చాలా బాగుంది. అలా చూపిస్తూ ఇలాంటి ఒక డైలాగ్ చెప్పించడం సంతోషమే. అదే సమయంలో వాళ్లు రియల్ లైఫ్‌లో కూడా అది ఫాలో అయితే బాగుంటుంది. హారహర మహాదేవ.. మళ్లీ చేసేది శివపూజలు దూరేది ఇంకెక్కడో అన్నట్టే ఉంటుంది’ అని మాధవీలత (Madhavi Latha) కామెంట్స్ చేశారు.