Actress Malavika: తన మొదటి సినిమా పై మాళవిక షాకింగ్ కామెంట్స్..!

సీనియర్ హీరోయిన్ మాళవిక అందరికీ గుర్తుండే ఉంటుంది. ‘చాలా బాగుంది’ అనే చిత్రంతో పరిచయమైన ఈ అమ్మడు అటు తర్వాత ‘చాలా బాగుంది’ ‘నవ్వుతూ బతకలిరా’ ‘దీవించండి’ ‘శుభకార్యం’ ‘ప్రియ నేస్తమా’ ‘అప్పారావు డ్రైవింగ్ స్కూల్’ వంటి తెలుగు చిత్రాల్లో నటించింది. అయినప్పటికీ ఈమె తెలుగు ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కొన్నాళ్ళ తర్వాత ‘చంద్రముఖి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించింది కానీ ఆ చిత్రం కూడా ఈమెకు ఆశించిన స్థాయిలో గుర్తింపుని తీసుకురాలేకపోయింది.

తమిళంలో అయితే ఈమె 35 సినిమాల వరకు చేసింది.2007లో ఈమె ప్రముఖ పారిశ్రామికవేత్త సుమేష్ మీనన్ ను వివాహం చేసుకుని సినిమాలను తగ్గించింది. చాలా కాలం తర్వాత ఈమె ‘ఆలీతో సరదాగా’ టాక్ షోకి గెస్ట్ గా వచ్చింది. ఈ షోలో ఆమె ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తన మొదటి సినిమా అనుభవాలను చెప్పుకొస్తూ..’ ‘చాలా బాగుంది’ సినిమా షూటింగ్ టైములో శ్రీకాంత్ మధ్యలోనే కోపంతో వెళ్లిపోయాడని.., రొమాంటిక్ సాంగ్ షూటింగ్ సమయంలో తాను కాస్త ఇబ్బంది పడ్డానని, తనకు అంత కంఫర్ట్ లేదని చెబితే శ్రీకాంత్ కు కోపం వచ్చి మధ్యలోనే వెళ్లిపోయాడనే అర్ధం వచ్చేలా కామెంట్స్ చేసింది.

ఇక ఇవివి గారితో పని చేయడం ఎలా అనిపించింది అనే ప్రశ్నకి ఆమె బదులిస్తూ… ‘చాలా సూపర్‌గా అనిపించింది కానీ రేప్ సీన్ నన్ను చాలా డిస్టర్బ్‌గా చేసింది. నెగెటివ్ క్యారెక్టర్ కూడా కావడంతో చాలా ఇబ్బంది బడ్డాను’ అని ఆమె తెలిపింది.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus