Actress Meena: మీనా 46వ పుట్టినరోజు వేడుకలు.. ఫొటోలు వైరల్!

నటి మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టి ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ ఇలా ఒకప్పటి అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. ఆ తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. మళ్లీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది. ‘దృశ్యం’ లాంటి హిట్టు సినిమాల్లో నటించింది. తన కూతురిని కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ ఆరోగ్య సమస్యలతో మరణించారు.

భర్త మరణం తర్వాత కొన్నాళ్ళు ఇంటికి పరిమితమైన మీనా.. ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవుతున్నారు. తన సినిమా షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. అలానే తన స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఈరోజు మీనా 46వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. తన బర్త్‌డేను స్నేహితులందరూ కలిసి ఎంతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంది మీనా.

చాలా కాలం తరువాత మీనా నవ్వుతూ కనిపిస్తుండడంతో.. ఎప్పటికీ ఆమె ఇలానే ఉండాలంటూ ఫ్యాన్స్ విషెస్ చెబుతున్నారు. ప్రస్తుతం మీనా బర్త్ డే సెలబ్రేషన్స్ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ 6 తెలుగు 21 మంది కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!

Most Recommended Video

భూమా మౌనిక కు ఆల్రెడీ పెళ్లయిందా?
బిగ్ బాస్ కంటెస్టెంట్ రేవంత్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఛార్మి మాత్రమే కాదు నిర్మాతలయ్యి భారీగా నష్టపోయిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus