Meena: విడాకులు తీసుకున్న హీరోతో పెళ్లికి సిద్ధమైన మీనా?

బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉంటూ అగ్రతారగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగినటువంటి వారిలో సీనియర్ హీరోయిన్ మీనా ఒకరు. ఇలా ఈమె తెలుగు తమిళ భాషలలో వందల సినిమాలలో నటించి మెప్పించారు. ఇక ఈమె కెరియర్ మంచి పొజిషన్లో ఉన్న సమయంలోనే విద్యాసాగర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు.

ఇక ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది. అయితే కూతురు జన్మించిన తర్వాత మీనా (Meena) తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. అంతా బాగుంది అనుకుంటున్న సమయంలోనే గత ఏడాది జూన్ నెలలో మీనా భర్త అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించిన విషయం మనకు తెలిసిందే.ఇలా భర్త మరణంతో మీనా ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఇప్పుడిప్పుడే ఈమె కోలుకుంటూ తిరిగి సినిమా పనులతో బిజీ అయ్యారు.

ఇలా సినిమా పనులలో బిజీగా మారినటువంటి మీనా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది. ఈమె త్వరలోనే రెండో పెళ్లి చేసుకోబోతోంది అటు పెద్ద ఎత్తున వార్తలు సృష్టించారు.అయితే ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తనని ప్రశాంతంగా ఉండనివ్వండి అంటూ ఈమె పూర్తిగా పెళ్లి వార్తలను ఖండించారు.అయితే తాజాగా సినీ క్రిటిక్ ప్రముఖ నటుడు తమిళ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొని మీనా రెండో పెళ్లి చేసుకోబోతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

గత ఏడాది తన భార్యకు విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు తీసుకున్న హీరోతో ఈమె పెళ్లికి సిద్ధమైందని, ఇప్పటికే వీరి నిశ్చితార్థానికి ముహూర్తం కూడా నిర్ణయించారని తెలుస్తుంది. ఇక ఆ హీరో మీనా కన్నా వయసులో చిన్నవాడు అయినప్పటికీ వీరిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు అంటూ ఈయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై మీనా అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఈ వార్తలను ఖండిస్తున్నారు.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus