Nagma: కేవైసీ పేరుతో నగ్మాని మోసం చేసి లక్ష కొట్టేశారట!

సైబర్ నేరగాళ్ల బాగోతాలు ఈ మధ్య ఇంకా ఎక్కువైపోయాయని చెప్పాలి. ఆన్ లైన్ మోసాలకు గురవ్వకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు, ప్రభుత్వం వారు ఎంత అవగాహన కల్పించినా ఎవరొకరు ఇలాంటి మోసాలకు గురవుతూ డబ్బులు పోగొట్టుకుని లబో దిబో అంటున్నారు. సామాన్యులకే కాదు సెలబ్రిటీలకు కూడా ఈ బాధలు తప్పడం లేదు. తాజాగా సీనియర్ స్టార్ హీరోయిన్ నగ్మా కూడా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి డబ్బులు పోగొట్టుకుంది. నగ్మా ఫోన్ కి ఓ మెసేజ్ రూపంలో ఓ లింక్ వచ్చింది.

అటు తర్వాత ఓ ఫోన్ కూడా వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో కేవైసీ అప్ డేట్ చేయాలి, గైడ్ చేస్తా అని చెప్పి ఆ వ్యక్తి నగ్మాని మిస్ లీడ్ చేసి ఆమె ఖాతాలో ఉన్న రూ.99,998 లను కొట్టేశారు ఆ సైబర్ నేరగాళ్లు. వాళ్ళ ఫోన్ రిమోట్ యాక్సెస్ లో ఉందని.. అయితే లింక్ లో ఎలాంటి వివరాలు షేర్ చేయలేదని నగ్మా తెలిపింది.

ఇలాంటి లింక్ లు క్లిక్ చేసి తన ఫోన్ కు యాక్సెస్ ఇవ్వడం వల్లనే తన డబ్బులు పోయాయని ఆమె చెబుతుంది. కనీసం 20 సార్లు తన ఫోన్ కి ఓటీపీ వచ్చిందని నగ్మా తెలియజేసింది. అదృష్టవశాత్తు తాను ఎక్కువ మొత్తం కోల్పోలేదని… నగ్మా చెప్పింది.అయితే వెంటనే ఆమె సైబర్ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చింది. ఈ క్రమంలో ఈమెలానే మొత్తం 80 మంది మోసపోయినట్టు తెలిసిందట.

దీంతో పోలీసులు ఈ విషయం పై దర్యాప్తు చేపట్టారని తెలుస్తుంది. ఇలాంటి మెసేజ్ లకు స్పందించి, ఆన్ లైన్ అకౌంట్ కు సంబంధించిన వివరాలు, ఓటీపీ లు చెప్పొద్దని ముంబై సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus