బాలీవుడ్ హాట్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ (Nargis Fakhri) రహస్యంగా పెళ్లి చేసుకుందా? అంటే అవుననే అంటున్నాయి సోషల్ మీడియాలో లీక్ అయిన ఫొటోలు. యూఎస్ కు చెందిన వ్యాపారవేత్త టోనీ బీగ్‌తో నర్గీస్ ఏడడుగులు వేసిందంటూ వార్తలు వెల్లువెత్తుతున్నాయి. పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.రెడిట్‌లో బోల్లిబ్లైండ్స్‌ఎన్‌గాసిప్ అనే పేజీలో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. వాటిల్లో ఒక ఫొటోలో డెకరేషన్ చేసిన వెడ్డింగ్ కేక్ ఉంది. దానిపై ‘హ్యాపీ మ్యారేజ్’, నర్గీస్, టోనీ పేర్ల మొదటి అక్షరాలు ఉన్నాయి.
ఇంకో ఫోటోలో ‘NF, TB’ అని రాసి ఉన్న ప్లకర్డ్ కూడా కనిపించింది. దీంతో ఇది నర్గీస్, టోనీ పెళ్లికి సంబంధించిన వేడుకే అని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇన్సైడ్ టాక్ ప్రకారం, పెళ్లి లాస్ట్ వీకెండ్ కాలిఫోర్నియాలోని ఓ లగ్జరీ హోటల్‌లో జరిగింది. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారట. నర్గీస్, టోనీ ఇద్దరూ పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు బయటకు రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నారట.
కానీ అవి లీక్ అయిపోయాయి.పెళ్లి తర్వాత ఈ జంట స్విట్జర్లాండ్‌లో హనీమూన్ ట్రిప్ వేసినట్లు సమాచారం. నర్గీస్ వెడ్డింగ్ రూమర్స్‌పై ఇంకా స్పందించకపోయినా, స్విట్జర్లాండ్ ట్రిప్‌కు సంబంధించిన బ్యూటిఫుల్ పిక్స్‌ను మాత్రం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. అంతేకాదు టోనీ బీగ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పెట్టిన పోస్టులను కూడా రీ-పోస్ట్ చేసింది.
రీసెంట్‌గా నర్గీస్ స్విమ్మింగ్ పూల్‌లో రిలాక్స్ అవుతున్న ఫోటో ఒకటి పెట్టింది. అందులో వెడ్డింగ్ రింగ్ హైలైట్ అయ్యేలా ఫొటో దిగింది. చూస్తుంటే పెళ్లి నిజమే అని నమ్మాల్సి వస్తోంది. నర్గీస్, టోనీ మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. టోనీ యూఎస్‌లో సెటిలయ్యారు. 2021 నుంచి వీళ్లిద్దరూ డేటింగ్ చేస్తున్నారు.