Natasha Doshi: పెళ్లి పీటలెక్కనున్న మరో హీరోయిన్‌… ఎంగేజ్‌మెంట్‌ అయిపోయింది… వరుడు ఎవరంటే?

మరో టాలీవుడ్‌ నాయిక పెళ్లి పట్టాలు ఎక్కబోతోంది. బాలకృష్ణతో ఓ సినిమా చేసి కాస్త ఫేమ్‌ తెచ్చుకున్న ఆ భామ.. ఆ తర్వాత సినిమాల్లో పెద్దగా కనిపించలేదు. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం తెగ సందడి చేస్తోంది. ఇప్పుడు ఆ భామ పెళ్లాడబోతోంది. ఆమె నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఆమెను పెళ్లి చేసుకోబోయేది ఎవరు అంటూ వెతుకులాట మొదలైంది. ఆ హీరోయిన్‌ ఎవరో చెప్పలేదు కదా.. ‘జై సింహా’లో నటించిన బ్యూటీనే.

‘జై సింహా’ సినిమా గుర్తు ఉందా? ఆ సినిమాలో కథానాయికగా నయనతార నటించింది. ఆమెతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా ఉన్నారు. అందులో ఒకరు నటాషా దోషి. బాలయ్య సరసన నటించి.. అందాల వర్షం కురిపించి.. వైరల్‌ కూడా అయ్యింది. అయితే ఆ తర్వాత సరైన సినిమా అవకాశాలు అందుకోలేకపోయింది. శుక్రవారం నాడు ఆమె నిశ్చితార్థం చేసుకుంది. ఈ మేరకు కొన్ని ఫొటోలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

మనన్ షా అనే యవకుడితో ఆమె ఏడు అడుగులు వేయనుంది. నిశ్చితార్థం వేడుకలో ఉంగరాలు మార్చుకున్న ఫోటోలను నటాషా దోషి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది. అయితే వీరి పెళ్లి ఎప్పుడు? అనేది మాత్రం ఆమె చెప్పలేదు. ‘ప్రేమ ఎప్పుడూ విజయం సాధిస్తుంది’ అని ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఆ లెక్కన ఆమెది ప్రేమ వివాహం అని అర్థమవుతోంది. త్వరలోనే ఈ విషయంలో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది.

ఇక నటాషా దోషి (Natasha Doshi) గురించి చూస్తే.. ‘జై సింహా’ కంటే ముందు మలయాళంలో నాలుగు సినిమాలు చేసింది. బాలకృష్ణ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత శ్రీకాంత్ ‘కోతల రాయుడు’ సినిమా చేశారు. ఆ తర్వాత అవకాశాలు పెద్దగా లేవు. ఈ క్రమంలో నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటించిన ‘ఎంత మంచివాడవురా’ సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది.

బేబీ సినిమా రివ్యూ & రేటింగ్!

హాస్టల్ డేస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
మహావీరుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus