పావని కారణం… ఇలా చెబితే చాలా మందికి అర్థం కాదేమో. అదే ‘పుష్ప 2’ (Pushpa 2) లో కావేరి అంటే అంతా టక్కున గుర్తుపట్టేస్తారు. ఆ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) అన్న కూతురిగా ఈమె కనిపించింది. ‘చిన్నాయన.. చిన్నాయన’ అంటూ చాలా హుషారుగా కనిపించింది. ఇందులో పావని కనిపించేది కాసేపే అయినా.. అది అతి కీలకమైన పాత్ర అని చెప్పాలి. సోషల్ మీడియాలో ఈమె గురించి మీమ్స్ కూడా ఎక్కువగానే వచ్చాయి.
‘ఒక్క రోజు కంప్యూటర్ క్లాస్ కి వెళ్లకపోతే ఏమైంది పావని (Pavani Karanam) కారణం?’ అంటూ ఈమె గురించి ఫన్నీ డిస్కషన్స్ కూడా జరుగుతుంటాయి. ‘పుష్ప 2’ క్లైమాక్స్ లో ఈమె కంప్యూటర్ క్లాస్ కి వెళ్తే.. అక్కడ విలన్ గ్యాంగ్ ఈమెను కిడ్నాప్ చేస్తారు. ఆ తర్వాత పుష్ప వెళ్లి అందరినీ తెగ నరికి ఆమెను రక్షిస్తాడు.. అందుకే ‘నీ వల్లే అంత రచ్చ చేశాడు పుష్ప’ అంటూ వాళ్ళు ఈమెను ట్యాగ్ చేస్తూ అలాంటి కామెంట్లు పెడుతుంటారు.
ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ తో వచ్చిన క్రేజ్ ను ఈమె గట్టిగా వాడుకోవాలని చూస్తుంది. ఆ సినిమా సక్సెస్ మీట్ కి చాలా గ్లామర్ గా రెడీ అయ్యి వెళ్లిన సంగతి తెలిసిందే. అలాగే ఛాన్స్ దొరికిన ప్రతిసారి సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంది. ఇటీవల ఈమె థైస్ షో చేస్తూ చేసిన ఫోటో షూట్ ప్రస్తుతం నెట్టింట్లో హల్ చల్ చేస్తుంది. ఆ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ‘బాగానే టాలెంట్ చూపిస్తున్నావు పావని కారణం’ అంటూ కొంతమంది ఈ ఫొటోలకి కామెంట్లు కూడా పెడుతున్నారు.