Pooja Hegde: లేటెస్ట్ పిక్స్ షేర్ చేసిన పూజా హెగ్డే.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

పూజా హెగ్డే.. బాలీవుడ్ నుండి టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి స్టార్ స్టేటస్ తెచ్చుకుంది. వరుసగా స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. హయ్యెస్ట్ రెమ్యునరేషన్ అందుకుంటుంది. దళపతి విజయ్ ‘బీస్ట్’ మూవీతో కోలీవుడ్‌లోనూ కాలు పెట్టింది. ఈ ఏడాది పూజా.. ప్రభాస్ ‘రాధే శ్యామ్’, చిరు, చరణ్‌ల ‘ఆచార్య’, విజయ్ ‘బీస్ట్’ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది కానీ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్, త్రివిక్రమ్ కాంబోలో మూవీ చేస్తోంది. ఇటీవలే కాలికి గాయం కావడంతో చిన్న గ్యాప్ తీసుకుంది.

హిందీలో రణ్‌వీర్ సింగ్ – రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న పీరియడ్ కామెడీ డ్రామా ‘సర్కస్’లో పూజా పాపే హీరోయిన్.. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న సినిమా రిలీజ్ అవుతోంది.. రీసెంట్‌గా ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది పూజా.. యాష్ కలర్ డ్రెస్సులో అంతా మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకుని మతాబులా మెరిసిపోతున్న పిక్స్ ఇన్‌స్టాలో షేర్ చేసింది.. కైపెక్కించే కళ్లతో కొంటె చూపులతో కుర్రకారు గుండెల్ని రంపంతో కోస్తున్న ఫీలింగ్ ఇస్తున్నట్టు ఉన్న పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

గుర్తుందా శీతాకాలం సినిమా రివ్యూ& రేటింగ్!
పంచతంత్రం సినిమా రివ్యూ & రేటింగ్!

ముఖచిత్రం సినిమా రివ్యూ & రేటింగ్!
బిగ్ బాస్ కోసం నాగార్జున ధరించిన 10 బ్రాండ్స్, కాస్ట్యూమ్స్ మరియు షూస్ కాస్ట్ ఎంతంటే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus