నటి పూనమ్ కౌర్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఇండస్ట్రీలో నటించినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నారు. ఇలా ఈమె సినిమాల ద్వారా ఇంత పాపులారిటీని సంపాదించుకోలేదు కానీ సోషల్ మీడియా వేదికగా చేసే వివాదాస్పద పోస్టులు కారణంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారు.కొన్నిసార్లు ఈమె ఎవరిని టార్గెట్ చేసి ఈ పోస్ట్ చేశారా అన్న అయోమయంలో కూడా నేటిజన్స్ ఉంటారు.
ఈ విధంగా పరోక్షంగా కొందరిని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా (Poonam Kaur) పూనమ్ చేసే పోస్టులు క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటాయి. ఇక పోతే తాజాగా ఈమె గురుపౌర్ణమి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.గురు పౌర్ణమి రోజు గురువును పూజించాలని చెబుతుంటారు అయితే ఈమె గురువు గురించి ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా చేసినటువంటి పోస్ట్ సంచలనంగా మారింది.
ప్రతి ఒక్కరిని తాను అభ్యర్థిస్తున్నాను. గురువును టామ్, డిక్ అని పిలవద్దు. నీతులు చెబుతూ స్టేజ్ మీద జీవితాలతో ఆడుకునే వారు గురువు కాదు. మీకు మంచి మార్గం చూపించే వారే గురువు అవుతారనీ రాసుకొచ్చారు. దీంతో ఈ పోస్ట్ కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈమె ఎవరిని ఉద్దేశించి ఇలాంటి పోస్ట్ చేశారో మాత్రం అర్థం కావడం లేదు.
సోషల్ మీడియా వేదికగా ఇలాంటి పోస్టులు చేస్తూ పూనమ్ ఇలాంటి వివాదాలను సృష్టిస్తూ ఉంటారు. ఇక ఈమె సినిమాలకు సంబంధించిన విషయాలను మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.