Actress Pragathi: ‘ఉ అంటావా ఉ ఊ అంటావా’ పాటకి నటి ప్రగతి హాట్ స్టెప్పులు..!

అల్లు అర్జున్- సుకుమార్ ల ‘పుష్ప’ చిత్రంలో స్టార్ హీరోయిన్ సమంత ఐటెం సాంగ్ లో నర్తించిన సంగతి తెలిసిందే. ఆ పాటకి ఇండియా వైడ్ మంచి ఆధరణ లభించింది. ‘ఉ అంటావా.. ఉఊ అంటావా’ అంటూ సాగే ఈ పాటతో 2021 కి అందరిలో ఎనర్జీని నింపి మరీ గుడ్ బై చెప్పింది ‘పుష్ప’ టీం. ఇప్పటికీ ఈ పాట యూట్యూబ్ లో తెగ ట్రెండ్ అవుతుంది. కొంతమంది నెటిజన్లు, బుల్లితెర సెలబ్రిటీలు ఈ పాటకి తెగ స్టెప్పులు వేశారు.

ఈ పాట పై ఎన్నో కవర్ సాంగ్స్ వచ్చాయి. అషు రెడ్డి వంటి భామలు ఈ పాటకి కవర్ సాంగ్ చేసి అలరించారు. ఇప్పుడు నటి ప్రగతి వంతు వచ్చింది. మామూలుగానే మాస్ పాటలకి ఇరగదీసి మరీ హాట్ హాట్ స్టెప్పులు వేస్తుంటుంది ప్రగతి. ఇక సమంత పాట అంటే ఇంకెంత ఎనర్జీతో రచ్చ చేస్తుంది అనే విషయం చెప్పనవసరం లేదు. అందుకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో కనిపించే ప్రగతి.. లాక్ డౌన్ పడినప్పటి నుండీ తన ఫిట్నెస్ పై దృష్టి పెట్టి.. జిమ్ లో తాను వర్కౌట్లు చేస్తున్న వీడియోలని పోస్ట్ చేస్తూ వస్తోంది. దాంతో సోషల్ మీడియాలో ఆమె ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగింది. ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాల్లో ప్రగతి పోషిస్తున్న పాత్రల్ని హైలెట్ చేస్తూ చూపిస్తున్నారు దర్శకులు. హీరో నితిన్ కూడా ఈమెతో కలిసి ఓ కమర్షియల్ యాడ్లో నటించాడు అంటే ప్రగతి క్రేజ్ ఏ రేంజ్లో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus