క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

మరికొద్ది రోజుల్లో ‘బిగ్ బాస్4’ మొదలు కాబోతుంది. ప్రస్తుతం ప్రోమోల సందడి కూడా మొదలైపోయింది. ఈ సీజన్ ను కూడా ‘కింగ్’ నాగార్జునే హోస్ట్ చెయ్యబోతున్నట్టు కూడా క్లారిటీ వచ్చేసింది. ఈసారి మాత్రం ‘బిగ్ బాస్4’ ను 50 రోజులు లేదా 75 రోజులు మాత్రమే నిర్వహించబోతున్నారు అనే వార్తలు కూడా వస్తోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు ఈసారి ‘బిగ్ బాస్’ ఆఫర్ ను చాలా మంది సెలబ్రిటీలు రిజెక్ట్ చేశారనే టాక్ కూడా నడుస్తుంది. ఈ లిస్ట్ లో నటి ప్రగతి కూడా ఉందని కూడా వార్తలు వచ్చాయి.

లాక్ డౌన్ మొదలైనప్పటి నుండీ ఈమె డ్యాన్స్ లు, యోగాలు చేస్తున్న వీడియోలు పెట్టి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఇదంతా ‘బిగ్ బాస్4’ కోసమేనా అని ఆమెను అడిగితే… షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘కేవలం ఫేమ్ లేని వాళ్ళు అలాగే ఇప్పటివరకూ ఉన్న నెగిటివ్ ఇమేజ్ ను మార్చుకోవాలనుకునే వాళ్ళే బిగ్ బాస్ కు వెళ్తారండీ..!అంతేకాదు డబ్బుకోసం కూడా వెళ్తారు. నాకు అవన్నీ అవసరం లేదు.దేవుడి దయ వల్ల నాకు అవన్నీ ఉన్నాయి.

వాటికోసం నేను తాపత్రయపడడం లేదు.ఇప్పటి వరకూ ఉన్న ఫేమ్ చాలు. నాకు ప్రేక్షకుల్లో మంచి పేరే ఉంది.. డబ్బు గురించి అతిగా ఆలోచించే మనిషిని కాను.! సో నేను బిగ్ బాస్ కు వెళ్లాలనుకోవడం లేదు.! దీని పై ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాను. అయినా ఇంకా ప్రచారం జరుగుతూనే ఉంది. ‘బిగ్ బాస్4′ నిర్వాహకులే వచ్చి నన్ను అడిగినా నాకు ఆసక్తి లేదని చెప్తాను’ అంటూ చెప్పుకొచ్చింది ప్రగతి.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus