Pranitha Subhash: ఎమోషనల్ అయిన హీరోయిన్ ప్రణీత.. ఏం జరిగిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ప్రణీత ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉంటున్నారు. పెళ్లి తర్వాత ఆమె వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని గాసిప్స్ ప్రచారంలోకి వచ్చినా ఆ వార్తలను ఆమె పెద్దగా పట్తించుకోలేదు. కన్నడ బ్యూటీ ప్రణీత ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలో ఒక క్రేజీ ప్రాజెక్ట్ లో నటిస్తున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ సినిమాలో దిలీప్ హీరోగా నటిస్తుండటం గమనార్హం. ఈ సినిమా గురించి ప్రణీత మాట్లాడుతూ మాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

మలయాళంలో డైలాగ్స్ చెప్పడం సులువు అయితే కాదని ఆమె కామెంట్లు చేశారు. ఈ సినిమాలో ఈగో ఉన్న యువతి రోల్ లో నేను కనిపిస్తానని ప్రణీత చెప్పుకొచ్చారు. మలయాళంలో మూవీ డైలాగ్స్ చెప్పడం నా ముందున్న ఛాలెంజ్ అని ప్రణీత కామెంట్లు చేశారు. నేను అమ్మ అయిన తర్వాత ఒప్పుకున్న తొలి మూవీ ఇదేనని ప్రణీత వెల్లడించారు. నా కూతురు ఆర్నాకు ఈ సినిమా వల్ల దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఎమోషనల్ అవుతూ ఆమె చెప్పుకొచ్చారు.

నేను నా పర్సనల్ లైఫ్ ను ప్రొఫెషనల్ లైఫ్ ను బ్యాలెన్స్ చేయాలని అనుకుంటున్నానని ప్రణీత తెలిపారు. ప్రణీత వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏడాదిన్నర క్రితం నితిన్ రాజు అనే వ్యక్తిని ప్రణీత వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత ప్రణీత సంతోషంగానే జీవనం సాగిస్తున్నారని తెలుస్తోంది.

ప్రణీత మలయాళ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారేమో చూడాల్సి ఉంది. ప్రణీత మరిన్ని సక్సెస్ లను అందుకుని సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగించడంతో పాటు ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రణీత తెలుగు సినిమాలలో కూడా నటించాలని కొంతమంది ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.

2008 లోనే హనీ రోజ్ చేసిన తెలుగు సినిమా ఏదో తెలుసా ??
నటి శృతి హాసన్ పాడిన 10 పాటలు ఇవే!

షారుఖ్-సల్మాన్ కలిసొచ్చినా… బాహుబలి, ఆర్ఆర్ఆర్, కెజిఫ్ లను కొట్టలేకపోయారు!
కాంబినేషన్ మాత్రం క్రేజీ – కానీ అంచనాలు మించే సినిమాలు అవుతాయి అంటారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus