Pranitha Subhash: మొదటిసారి కూతురి ఫేస్ ను చూపించిన ప్రణీత..ఫోటో వైరల్..!

హీరోయిన్ ప్రణీత సుభాష్‌ జూన్ 10న పండంటి ఆడ పిల్లకి జన్మనిచ్చింది. కూతురితో తీసుకున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి ఈ విషయాన్ని చెబుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేసిన ప్రణీత… ఆ తర్వాత తన కూతురితో తీసుకున్న చాలా ఫోటోలు షేర్ చేసింది కానీ తన పాప ఫేస్ ను మాత్రం చూపించలేదు. తన కూతురికి దిష్టి తగులుతుందనో ఏమో కానీ, ప్రణీత తన పాపను సోషల్ మీడియాకి దూరంగా ఉంచుతూ వచ్చింది.

కానీ మొత్తానికి తన పాప మొహాన్ని చూపించింది. తన పాపను ముద్దాడుతూ తీసుకున్న ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఈ ఫొటోల్లో ప్రణీత కూతురు చాలా క్యూట్ గా ఉంది. అయితే మొన్న తన భర్త పాదాలకు నమస్కరిస్తూ ప్రణీత పోస్ట్ చేసిన ఫొటోల్లో ఆమె కొంచెం ఎక్కువ బరువు ఉన్నట్టు కనిపించింది. కానీ తాజా ఫొటోల్లో ఆమె సన్నగానే కనిపిస్తుంది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ప్రణీత..

గత ఏడాది అంటే 2021 మే 30న బెంగుళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజు అనే బిజినెస్మెన్ ను సీక్రెట్ గా పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ‘ఏం పిల్లో ఏం పిల్లడో’,’బావ’ ‘అత్తారింటికి దారేది’ .. వంటి చిత్రాల్లో నటించి క్రేజ్ ను సంపాదించుకుంది ప్రణీత. స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లకపోయినా ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. లాక్ డౌన్ టైంలో ఆమె చేసిన సేవా కార్యక్రమాలు ఎవ్వరూ కూడా అంత ఈజీగా మర్చిపోలేరు. ఎంతో మంది ఆకలి తీర్చి రియల్ హీరోయిన్ అనిపించుకుంది.

1

2

3

4

5

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus