Priyamani: నంబర్1 హీరోలతో అందుకే నటించడం లేదు.. ప్రియమణి కామెంట్స్ వైరల్!

టాలీవుడ్, బాలీవుడ్, ఇతర ఇండస్ట్రీలలో వరుస మూవీ, వెబ్ సిరీస్, ఇతర ఆఫర్లతో ప్రియమణి (Priyamani) బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. స్టార్ హీరోలతో ప్రియమణి తెలుగులో ఎక్కువ సినిమాలలో నటించలేదనే సంగతి తెలిసిందే. బాలయ్య (Balakrishna) , వెంకటేశ్ (Venkatesh) , జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) మరి కొందరు స్టార్స్ కు మాత్రమే ఆమె జోడీగా నటించారు. ప్రియమణి కీలక పాత్రలో నటించిన మైదాన్ (Maidaan) మూవీ ఈ నెల 10వ తేదీన థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ప్రియమణికి స్టార్ హీరోల సరసన ఎక్కువ సినిమాల్లో ఎందుకు నటించలేదనే ప్రశ్న ఎదురైంది.

ఆ ప్రశ్నకు ప్రియమణి స్పందిస్తూ టాప్ లిస్ట్ లో ఉండే హీరోలకు జోడీగా నన్నెందుకు తీసుకోరనేది నాకు అర్థం కాదని ప్రియమణి పేర్కొన్నారు. ఇప్పటికీ ఆ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదని ఆమె కామెంట్లు చేశారు. ఈ ప్రశ్న దర్శకనిర్మాతలను అడిగితే బాగుంటుందని ఆమె అన్నారు. ఈ విషయంలో నేను ఎవరినీ తప్పు పట్టడం లేదని ప్రియమణి పేర్కొన్నారు.

చాలామంది దగ్గర నేను విన్నది ఏంటంటే నన్ను సినిమాలో తీసుకుంటే నా పక్కన ఉన్నవాళ్లు కనపడకుండా డామినేట్ చేస్తానట అని ఆమె కామెంట్లు చేశారు. అందుకే స్టార్ హీరోలకు జోడీగా నన్ను సినిమాలలో తీసుకోవడానికి ఆసక్తి చూపించరని ప్రియమణి పేర్కొన్నారు. అలా అంటారు కానీ అది నిజం కాదని ప్రియమణి తెలిపారు. నేను చేస్తున్న రోల్స్ తో నేను సంతృప్తిగానే ఉన్నానని అమె చెప్పుకొచ్చారు.

నంబర్ వన్ హీరోలతో కలిసి నటించడం వల్ల కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయని ప్రియమణి అన్నారు. ఆ హీరోలతో కలిసి పని చేయకపోవడం వల్ల ఆ ప్రయోజనాలు మిస్ అవుతానేమో అనిపిస్తుందని ఆమె వెల్లడించడం గమనార్హం. సగం మంది స్టార్స్ నాకు పరిచయస్థులే అయినా వాళ్ల సినిమాల్లో నన్ను ఎందుకు ఎంపిక చేయరో అని బాధగా ఉంటుందని ప్రియమణి చెప్పుకొచ్చారు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus