సీనియర్ హీరోయిన్లు చాలా మంది ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ లుగా రాణిస్తున్నారు. అయితే ఈ లిస్ట్ లో టాప్ ఆర్డర్ ఉన్న నటి రమ్యకృష్ణ అనడంలో సందేహం లేదు. ఒకానొక టైంలో హీరోయిన్ గా తన గ్లామర్ తో, నటన తో ఓ ఊపు ఊపేసిన రమ్యకృష్ణ ఇప్పటికీ తన క్రేజ్ ను మెయింటైన్ చేస్తున్నారు. హీరోయిన్లకు పెళ్లిళ్లు అయితేనే కెరీర్ దాదాపు ముగిసిపోయింది అని అంటుంటారు. ఆ తరువాత వాళ్ళు సినిమాల్లో నటించడానికి ఇంట్రెస్ట్ చూపించినా వారు డిమాండ్ చేసిన పారితోషికం దర్శకనిర్మాతలు ఇస్తారన్న గ్యారెంటీ లేదు.
అయితే ‘బాహుబలి’ చిత్రం రమ్యకృష్ణ సెకండ్ ఇన్నింగ్స్ కు మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. స్టార్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని రేంజ్లో పారితోషికం అందుకుంటూ అందరికీ షాకిస్తుంది రమ్యకృష్ణ. ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘సూపర్ డీలక్స్’ ‘గ్యాంగ్'(తమిళ్) ‘శైలజారెడ్డి అల్లుడు’ వంటి చిత్రాలు కూడా ఈమెకు బాగా కలిసొచ్చాయి. చేసేది తల్లి, అత్త పాత్రలే అయినప్పటికీ రమ్యకృష్ణ ఉంటే చాలు.. సినిమాకి క్రేజ్ వస్తుంది అని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం రమ్యకృష్ణ నటిస్తున్న సినిమాలకు భారీగా పారితోషికం అందుకుంటుందని తెలుస్తుంది.
రమ్యకృష్ణ షూటింగ్లో పాల్గొనే ఒక్కో రోజుకు రూ.10 లక్షల చొప్పున పారితోషికం తీసుకుంటుందట. ఈమె 10రోజులు కనుక షూటింగ్లో పాల్గొంటే 1కోటి రూపాయలు దర్శకనిర్మాతలు సమర్పించుకోవాలన్న మాట. ‘రిపబ్లిక్’ ‘బంగార్రాజు’ చిత్రానికి ఈమె కోటిపైనే అందుకున్నట్టు వినికిడి. స్టార్ హీరోయిన్లైన పూజ హెగ్డే, రష్మిక , కీర్తి సురేష్ వంటి వారు రూ.2 కోట్ల నుండీ రూ.3కోట్ల వరకూ పారితోషికం అందుకుంటున్నారు.
ఇక కుర్ర హీరోయిన్లైన రాశీ ఖన్నా, నిధి అగర్వాల్, నభా నటేష్ వంటి వారు 0.60 కోట్ల వరకూ అందుకుంటున్నారు. ఆ రకంగా చూస్తే రమ్య కృష్ణ .. కుర్ర హీరోయిన్లను మించి.. స్టార్ హీరోయిన్లకు దగ్గరగా పారితోషికం అందుకుంటున్నారన్న మాట.