రష్మిక మందన తెలుగు, కన్నడంలోనే కాకుండా తమిళ, హిందీ భాషల్లో కూడా స్టార్ డం సంపాదించుకుంది. కొత్త హీరోయిన్లు ఎంట్రీ ఇస్తున్నప్పటికీ రష్మిక డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. 2023 చివర్లో ‘యానిమల్’ సినిమాతో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న రష్మిక.. 2024 డిసెంబర్ ఎండింగ్లో ‘పుష్ప 2’ తో మరో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకుంది.
శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి హీరోయిన్లు దూసుకొస్తున్నా.. ఓ పెద్ద పాన్ ఇండియా హిట్ కొట్టేసి రష్మిక మళ్ళీ మొదటి స్థానంలోకి వచ్చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. ఒకటి ధనుష్ తో చేస్తున్న ‘కుబేర’. ఇంకోటి బాలీవుడ్ ప్రాజెక్టు. ఇదిలా ఉండగా.. తాజాగా రష్మికకి గాయాలు అయ్యాయట. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘సికిందర్’ లో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక. ఈ సినిమాకి సంబంధించిన ఓ కీలక షెడ్యూల్ కోసం.. రష్మిక జిమ్ లో తెగ కసరత్తులు చేస్తుంది.
ఈ కఠినమైన కసరత్తులు వల్ల ఆమె గాయపడినట్టు తెలుస్తుంది. ఆమె కాలికి గాయమైందట. అలాగే భోజనానికి కూడా కొంత శస్త్ర చికిత్స చేసినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కొద్దిరోజుల పాటు ఆమెకి బెడ్ రెస్ట్ అవసరమని డాక్టర్లు సూచించినట్లు తెలుస్తోంది.అయితే దీనిపై రష్మిక లేదా ఆమె టీం అధికారికంగా స్పందించింది లేదు. ఇది ఆమె అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఆమె స్పందించి క్లారిటీ ఇస్తే కొంత బెటర్.