Rashmika: వామ్మో.. రష్మిక అసలు తగ్గట్లేదుగా!

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. వరుస సక్సెస్ లతో దూసుకుపోతుంది. బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకుంటోంది. ‘పుష్ప’ సినిమా రష్మిక క్రేజ్ ని మరింత పెంచింది. ఈ సినిమాకి గాను అమ్మడు రెమ్యునరేషన్ గా కోటి రూపాయలు అందుకుంది. అయితే ఇప్పుడు సీక్వెల్ కోసం ఏకంగా రూ.4 కోట్లు డిమాండ్ చేస్తుందని సమాచారం. అంత మొత్తం అందుకునే రేంజ్ రష్మికకు ఉందా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

టాలీవుడ్ లో ప్రస్తుతం బంద్ నడవడానికి ఒక కారణం నటీనటులు రెమ్యునరేషన్స్ పెంచడం. ఇలాంటి సమయంలో రష్మిక రూ.4 కోట్లు డిమాండ్ చేయడం వార్తల్లో నిలిచింది. నిజానికి ‘పుష్ప’ సినిమాకి వచ్చిన క్రేజ్ కారణంగానే రష్మికకి బాలీవుడ్ లో ఆఫర్లు వస్తున్నాయి. అక్కడ కూడా ఒక్కో సినిమాకి నాలుగు కోట్లు చొప్పున తీసుకుంటుంది. ఇప్పుడు టాలీవుడ్ లో కూడా అంతే ఇవ్వమని డిమాండ్ చేస్తోంది. రష్మిక స్టార్ హీరోయినే కానీ సమంత, నయనతారలాంటి హీరోయిన్లతో ధీటుగా పోటీ పడేంత లేదు.

సామ్, నయన్ స్టార్ డమ్ తోనే సినిమాలు నడిచిన సందర్భాలు ఉన్నాయి. లేడీ ఓరియెంటెడ్ కథలతో కూడా హిట్స్ అందుకున్నారు ఈ తారలు. అందుకే వారికి ఎక్కువ రెమ్యునరేషన్స్ పే చేస్తుంటారు. ఇలాంటి కమర్షియల్ ఈక్వేషన్స్ ను పక్కన పెట్టి రష్మిక నాలుగు కోట్లు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది.

మరి నిర్మాతలు ఆమె అడిగినంత మొత్తాన్ని ఇస్తారో లేదో చూడాలి. మరోపక్క టాలీవుడ్ గిల్డ్ ఈ రెమ్యునరేషన్స్ పై కూడా ఓ నిర్ణయం తీసుకోనుంది. అవి ఇంప్లిమెంట్ చేస్తే.. రష్మిక అనుకున్నంత డిమాండ్ చేయడానికి ఉండదు. మరేం జరుగుతుందో చూడాలి!

బింబిసార సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సీతారామం సినిమా రివ్యూ & రేటింగ్!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus