Rohini,Raghuvaran: రఘు వరన్ వర్థంతి సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ చేసిన భార్య రోహిణి..!

వెర్సటైల్ యాక్టర్ రఘు వరన్ 15వ వర్థంతి సందర్భంగా.. భర్తను తలుచుకుంటూ ఆయన భార్య రోహిణి భావోద్వేగానికి గురయ్యారు.. ఈరోజు రఘు వరన్ కనుక బతికుంటే ఇప్పటి సినిమాలను ఎంతో ఇష్టపడేవారంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారామె.. 1996లో వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. 2000 సంవత్సరంలో ఓ బాబు పుట్టాడు.. కానీ వీరి బంధం ఎక్కువ కాలం నిలబడలేదు.. మనస్పర్థల కారణంగా 2004లో విడాకులు తీసుకున్నారు.. 2008 మార్చి 19న తన 49వ ఏట రఘువరన్ కన్నుమూశారు..

2023 మార్చి 19న రఘు వరన్ 15వ వర్థంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు రోహిణి.. రఘు వరన్ జీవించి ఉంటే నేటి సినిమాలను ఇష్ట పడేవారని.. ఒక నటుడిగా చాలా సంతోషించేవారని ఉద్వేగంతో పేర్కొంటూ భర్త అరుదైన ఫోటో షేర్ చేశారు రోహిణి.. బాల నటిగా, కథానాయికగా, తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణించారామె.. రఘు వరన్ కూడా హీరో, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు..

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పట్లోనే పాన్ ఇండియా యాక్టర్ రఘవరన్.. ప్రతినా కళ్లతోనే హావభావాలు పలికించడం.. డిఫరెంట్ వాయిస్‌తో భయపెట్టడం ఆయనకే సాధ్యం.. పలు విజయవంతమైన చిత్రాలలో విభిన్న పాత్రలతో ఆకట్టుకున్నారు.. ప్రతినాయక పాత్రలకు పెట్టింది పేరు రఘు వరన్.. ‘పసివాడి ప్రాణం’, ‘శివ’, ‘బాషా’, ‘సుస్వాగతం’,‘మాస్’ ..

ఇలా తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ సూపర్ హిట్ సినిమాలలో అద్భుతమైన పాత్రలు పోషించి మెప్పించారు.. విలన్ అంటే రఘువరన్.. విలనిజం అంటే రఘ వరన్‌దే అన్నంతగా తెరపై, ప్రేక్షకుల్లో చెరుగని ముద్ర వేశారు.. ఆయన తెలుగులో చివరిగా నితిన్ నటించిన ‘ఆటాడిస్తా’ మూవీలో కనిపించారు.. కాగా రఘు వరన్ కొడుకు సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ రోహిణి క్లారిటీ ఇవ్వలేదు.. ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ద్వారా తన పర్సనల్ అప్ డేట్స్ షేర్ చేస్తుంటారామె..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus