Rohini: పాపం సర్జరీ కోసం వెళ్తే చేతులు ఎత్తేసిన డాక్టర్స్! అసలు ఏమి జరిగింది?

అదృష్టంతోపాటు ఆరోగ్యం కూడా ఉండాలి..అందుకే అంటారు పెద్దలు ఆరోగ్యమే మహా భాగ్యమని అది నిజమేనని ఇప్పుడు నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అదృష్టం ఇంటి ముందే ఉంది..కానీ దరిద్రం తలపై డ్యాన్స్ వేస్తున్నట్లు ఉంది కమెడియన్ రోహిణి పరిస్ధితి అసలు ఏమి జరిగిందో తెలుసుకుందాం. సీరియ‌ల్స్‌, షోస్‌, ప్రోగ్రామ్స్ మెప్పించ‌టం ద్వారా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకుంటోన్న లేడీ ఆర్టిస్టుల్లో రోహిణి ఒక‌రు. ఆమె ప్ర‌ముఖ కామెడీ షో జ‌బ‌ర్ద‌స్త్‌లోనూ క‌నిపించి మెప్పిస్తోంది. ఇప్పుడు చేతినిండా అవ‌కాశాల‌తో ఆమె ఫుల్ బిజీగా ఉంటోంది.

ఈ నేప‌థ్యంలో ఆమెకు అనుకోని ఇబ్బంది కెరీర్‌పై ప్ర‌భావం చూపించేలా ఉంది. ఇంత‌కీ ఆ ఇబ్బందేంట‌నే వివ‌రాల్లోకి వెళితే.. 2016లో రోహిణికి యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు డాక్ట‌ర్స్ కాలికి రాడ్ వేశారు. న‌టిగా బిజీగా ఉండ‌టం వ‌ల్ల ఆ రాడ్‌ను తొలగించ‌లేదు. ఈ మ‌ధ్య టీవీ డాన్స్ షోస్‌లో డాన్స్ చేస్తున్న‌ ఆమెకు కాలిలో నొప్పి మొదలైంది. దీంతో ఆమె వైద్యులను సంప్ర‌దించింది. అయితే వారు ఆమెకు షాకింగ్ విష‌యాన్ని చెప్పారు. అదేంటంటే.. యాక్సిడెంట్ స‌మ‌యంలో అమ‌ర్చిన రాడ్‌ను తొల‌గించ‌లేమ‌ని.

ఇది నిజంగా రోహిణికి (Rohini) షాకింగ్ విష‌య‌మ‌నే చెప్పాలి. దీని గురించి ఆమె యూ ట్యూబ్‌లో వీడియో పోస్ట్ చేసింది. ‘‘యాక్సిడెంట్ సమయంలో ఎముక‌కు స‌పోర్ట్‌గా వేసిన రాడ్ ఇరుక్కుపోయింది. డాక్ట‌ర్స్ దాన్ని తొల‌గించ‌లేక‌పోయారు. ఒక‌వేళ బ‌లవంతంగా తొల‌గించాల‌ని ప్ర‌య‌త్నిస్తే ఎముక విరిగిపోయే ప్ర‌మాద‌ముంద‌ని డాక్ట‌ర్స్ అన్నారు. కాబ‌ట్టి ఆ రాడ్‌ను తొల‌గించ‌క‌పోవ‌ట‌మే మంచిద‌ని వారు స‌ల‌హా ఇచ్చారు’’ అన్నారు రోహిణి.‘‘ప్రస్తుతం వరుస షోస్, సినిమాలు, ఛాన్సులతో బిజీగా ఉన్నాను.

కాలిలోని రాడ్‌ను తీసేయించుకుంటే బావుంటుంద‌ని ఆప‌రేష‌న్ వ‌ర‌కు వ‌చ్చాను. అన‌వ‌స‌రంగా ఆప‌రేష‌న్ చేసుకున్నా. ఇప్పుడు మళ్ళీ కొన్ని నెలలు రెస్ట్ తీసుకోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. . ఆ రాడ్ బయటకు రాలేదు, ఆఫర్స్ ఉన్నప్పుడు ఇలా గ్యాప్ రావ‌టం అనేది చాలా ఇబ్బందిక‌రం. బయటకు నవ్వుతున్నా లోపల చాలా బాధగా ఉంది’’ అని ఎమోష‌న‌ల్‌గా మాట్లాడింది రోహిణి. దీంతో రోహిణి ప్యాన్స్ , కో యాక్టర్స్ ఆమె త్వరగా కోలుకోవాలని, మళ్ళీ ఫాస్ట్ గా టీవీలోకి రావాలని కోరుకుంటున్నారు.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus