Sai Pallavi: అలా చేయడం తప్పు కాదంటున్న సాయిపల్లవి!

టాలీవుడ్ ఇండస్ట్రీలోని ఇతర హీరోయిన్లతో పోల్చి చూస్తే సినిమాల విషయంలో సాయిపల్లవి ప్రత్యేకం అనే సంగతి తెలిసిందే. గ్లామరస్ రోల్స్ కు దూరంగా ఉంటూనే తన క్రేజ్ తో సాయిపల్లవి సక్సెస్ లను అందుకుంటున్నారు. ఈ నెల 17వ తేదీన రానా, సాయిపల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సినిమాలో సాయిపల్లవి వెన్నెల రోల్ లో నటించగా సాయిపల్లవి ఫ్యాన్స్ ఆమె కోసమే ఈ సినిమా చూస్తామని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోగ్రామ్ కు హాజరైన సాయిపల్లవి ఈ ప్రోగ్రామ్ లో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సాయిపల్లవి మాట్లాడుతూ తెలుగబ్బాయిని పెళ్లి చేసుకోవాలని నాన్నవాళ్లు చెబుతారని ఇంట్లో మేము బడగ మాట్లాడతామని మధ్యలో నేను తెలుగులో మాట్లాడతాను కాబట్టి నాన్నవాళ్లు అలా చెప్పారని సాయిపల్లవి కామెంట్లు చేశారు. నేను 23 సంవత్సరాల వయస్సులో పెళ్లి అవుతుందని 30 సంవత్సరాల లోపు నాకు ఇద్దరు పిల్లలు ఉంటారని అనుకున్నానని ఆమె చెప్పుకొచ్చారు.

మనం జనరల్ గా పరీక్షల్లో కాపీ కొడతామంటూ పరీక్షల గురించి సాయిపల్లవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను బాబాను నమ్ముతానని సాయిపల్లవి కామెంట్లు చేశారు. నాకు కంఫర్ట్ గా లేని రోల్స్ లో, సినిమాలలో నటించడానికి ఎప్పుడూ ప్రయత్నించలేదని ఆమె తెలిపారు. నాకు ఎంబీబీఎస్ చదవడం కాన్ఫిడెన్స్ ఇచ్చిందని సినిమాలు వద్దనుకుంటే అలా కెరీర్ ను కొనసాగిస్తానని ఆమె తెలిపారు. పొట్టి బట్టలు వేసుకోవడం తప్పు కాదని చూసే విధానం ఎప్పుడు మారుతుందో అప్పుడే కాన్ఫిడెన్స్ వస్తుందని ఆమె తెలిపారు.

నా డ్యాన్స్ ముందు హీరో వీక్ అయిపోతారనడంలో వాస్తవం లేదని ఆమె తెలిపారు. ఫిదా నుంచి ఇప్పటివరకు అన్ని సినిమాలకు తానే డబ్బింగ్ చెప్పానని ఆమె అన్నారు. సినిమాల ద్వారా సంపాదించే డబ్బును అమ్మకు ఇచ్చేస్తానని ఆమె తెలిపారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus