Samantha: అలా చేయడం నా వల్ల కాలేదు.. సామ్ కామెంట్స్ వైరల్!

టాలీవుడ్ అగ్రనాయిక అయిన సమంత తన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటుంది. సమంతకు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ కూడా అంతా ఇంతా కాదు. సమంత ఎలాంటి పోస్ట్ చేసినా అది విపరీతమైన రీచ్ తో వైరల్ అవుతాయి. అలా తాను మయోసైటిస్ బారిన పడినట్టు, చికిత్సా విధానం, తాను కోలుకుంటున్న తీరు అన్నీ సోషల్ మీడియాలో పంచుకుంది. అలా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది సామ్.తాజాగా శాకుంతలం సినిమా గురించి సమంత చేసిన పస్తులు వైరల్ అవుతున్నాయి.

శాకుంతలం సినిమాల్లో నటిస్తున్నప్పుడు తాను పొందిన కష్టమైన సన్నివేశాలను సమంత అభిమానులతో పంచుకుంది. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో సమంత చేసిన పోస్టులు వైరల్ అవుతున్నాయి.”నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తేటప్పుడు అఖరికి ఏడుస్తున్నప్పుడు కూడా ముఖంలో ఎక్స్‌ ప్రెషన్‌ ఒకేలా పెట్టాల్సి వచ్చింది. అలాగే ఈ భంగిమనే కొనసాగించాల్సి వచ్చింది. అలా ఒకే స్టైల్‌ను కొనసాగించడం నా వల్ల కాలేదు. దాని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్నాను. అలా కాకుండా ఈ సాషా(పెంపుడు కుక్క)ను తీసుకువెళ్లాల్సింది” అని పోస్ట్ చేసింది.

ఈ పోస్టుకు సమంత శాకుంతలం స్టిల్ లో ఉన్న తన ఫోటో మరియు తన పెంపుడు కుక్క ఫోటోను అటాచ్ చేసి షేర్ చేసింది. చాలా రోజుల తరువాత సామ్ బయటికి వచ్చి ఇలా అప్ డేట్స్ ఇస్తుండటంతో ఫాన్స్ అయితే ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం “శాకుంతలం” సినిమా డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉంది సామ్. మయోసైటిస్ వ్యాధి తర్వాత సమంత అభిమానులు ఎమోషనల్ గా రియాక్ట అవుతున్నారు. సమంత త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉండగా సమంత ప్రస్తుతం “శాకుంతలం” మూవీ పనుల్లో బిజీగా ఉంది. గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 1 తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీ కాకుండా.. విజయ్ దేవరకొండతో కలిసి “శివ నిర్వాణ” దర్శకత్వంలో “ఖుషి” సినిమాలో నటిస్తోంది. ఏది ఏమైనా సమంత పూర్తి ఆరోగ్యాంగా వచ్చి, తిరిగి మళ్ళీ ఆనందంగా ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus