Samantha: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన సమంత..!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తీవ్ర అస్వస్దతకి గురైనట్టు వార్తలు వస్తున్నాయి.వరుసగా తిరుపతి, కడప వంటి ప్రదేశాల్లో ఆదివారం నాడు పర్యటించిన సమంత తీవ్రమైన జలుబు, వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో ఆమె హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ అసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరినట్టు సమాచారం.నిన్న ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ నిమిత్తం కడప వెళ్ళింది సమంత. ఆమె వస్తుందని తెలుసుకున్న అక్కడి స్థానికులు , అభిమానులు గుంపులుగా కూడి వచ్చారు.సమంత కోసం వచ్చిన జనాన్ని కంట్రోల్ చేయడం షాపింగ్ మాల్ సిబ్బందికి, పోలీసులకు కష్టమైంది.

అయినప్పటికీ ఆ కార్యక్రమం సక్రమంగా ముగిసింది. అనంతరం ‘ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి హాజరవ్వడం అనేది చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చింది.ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత కడపలో ఉన్న పెద్ద దర్గాను దర్శించి.. చాదర్‌ను సమర్పించింది సమంత. ఓ పక్క ఒమిక్రాన్ కేసులు కూడా నమోదవుతున్న తరుణంలో సమంత ఇలా అనారోగ్యం పాలవ్వడం పట్ల ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే సమంత సన్నిహితులు మాత్రం.. “సమంత పూర్తి ఆరోగ్యంగా ఉన్నారు..నిన్న కొంచెం దగ్గు ఉండటంతో AIG హాస్పిటల్లో టెస్ట్ చేయించుకుని తన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. సోషల్ మీడియాలో వచ్చే కథనాలను నమ్మొద్దు” అంటూ చెప్పుకొచ్చారు. మరోపక్క సినిమాల విషయానికి వస్తే.. నాగచైతన్యతో విడాకుల అనంతరం సమంత వరుసగా తనని వెతుక్కుంటూ వచ్చిన సినిమా అవకాశాలను అంగీకరిస్తుంది.

‘శాకుంతలం’ ‘యశోద’ వంటి చిత్రాలతో పాటు ఓ హాలీవుడ్ మూవీలో నటించడానికి రెడీ అయ్యింది సమంత. అలాగే ‘ది ఫ్యామిలీ మెన్ 2’ వెబ్ సిరీస్‌ కు గాను ఫిలింఫేర్ అవార్డ్ ను కూడా కైవసం చేసుకుంది. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్పలో’ కూడా ఈమె ‘ఉ అంటావా లేక ఉఊ అంటావా’ అనే ఐటెం సాంగ్ లో నర్తించింది. ఈ పాట రెండు రోజుల నుండీ తెగ ట్రెండ్ అవుతుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus