Shriya Saran: కూతురి బర్త్ డే కి స్పెషల్ విషెస్ చెప్పిన శ్రీయ… వైరల్ అవుతున్న ఫోటోలు,వీడియో..!

విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఇష్టం’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టింది శ్రీయ శరన్. అటు తర్వాత ‘సంతోషం’ ‘చెన్నకేశవరెడ్డి’ ‘ఠాగూర్’ ‘నేనున్నాను’ వంటి చిత్రాలతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. అటు తర్వాత పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి ఇప్పటి స్టార్ హీరోలకు కూడా జోడీగా నటించి అలరించింది. ఈమె టాలీవుడ్లో అడుగుపెట్టి దశాబ్ద కాలం దాటినా ఇంకా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుండడం విశేషంగా చెప్పుకోవాలి.

సీనియర్ స్టార్ హీరోలకు భార్య పాత్రలు ఈమెకే వరిస్తున్నాయి. ఆ రకంగా ఈమె ఇంకా స్టార్ స్టేటస్ ను కొనసాగిస్తుంది. ఇదిలా ఉండగా.. 2018 లో రష్యా క్రీడాకారుడు ఆండ్రీ కొస్చీవ్ ను పెళ్లి చేసుకుని లాక్ డౌన్ టైంలో పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. తన కూతురికి రాధ అని నామకరణం చేసింది శ్రీయ. ఇదిలా ఉండగా.. జనవరి 10న రాధ రెండో పుట్టినరోజు. ఈ సందర్భంగా తన కూతురికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ ను చెబుతూ ఓ బ్యూటిఫుల్ వీడియోని షేర్ చేసుకుంది శ్రీయ.

‘ఐ లవ్ యు రాధా.. హ్యాపీ బర్త్ డే.. ఐ లవ్ యు… ఐ లవ్ యు.. ఐ లవ్ యు.. ఐ లవ్ యు.. ఐ లవ్ యు.. థాంక్యూ ఫర్ ఛేజింగ్ మీ యాజ్ మమ్మ.. థాంక్యూ’ అంటూ చెప్పుకొచ్చింది శ్రీయ. ఈ వీడియోలో శ్రీయ వెనుక ఆమె కూతురు చేస్తున్న చిలిపి అల్లరి కూడా చాలా క్యూట్ గా ఉంది అని చెప్పొచ్చు. మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus