ఓ మనిషి ప్లాస్టిక్ సర్జరీలకే రూ. పది కోట్లు ఖర్చు పెట్టారు అంటే నమ్మగలరా? మామూలుగా అయితే నమ్మలేకపోవచ్చు కానీ క్లో ఖాన్‌ను చూశాక, ఆమె చెప్పింది విన్నాక కచ్చితంగా నమ్ముతారు. అంతేకాదు ఆ వెంటనే ఔనా! అని ఆశ్చర్యపోతారు కూడా. ఎందుకంటే ఆమె చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీలు అలాంటివి మరి. క్లో ఖాన్ అంటే ఎవరు అనుకుంటున్నారా? ఆమె ఓ మోడల్. టీవీల్లో కూడా నటించింది. ఇటీవల ఆమె ఇంగ్లిష్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు చెప్పింది.
చాలామంది మోడల్స్ బ్రెస్ట్ ఎన్‌లార్జ్‌మెంట్, సీటు పెంచుకోవడం వంటి ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకుంటూ ఉంటారు. క్లో వాటితోపాటు మర్మవయవానికి కూడా చిన్నపాటి సర్జరీ చేయించుకుందట. 29 ఏళ్ల క్లో ఇప్పటివరకు ఈ సర్జరీల మీద మిలియన్ పౌండ్స్ ఖర్చు పెట్టిందట. అంటే మన కరెన్సీలో సుమారు రూ. 10 కోట్లు. ఆమె జుట్టు, ముఖానికి కూడా సర్జరీలు చేయించుకుందట. స్కిన్ కేర్, నాన్ సర్జికల్ ప్రొసీజర్లు కూడా చేయించుకున్నా అని చెప్పింది క్లో.
క్లో గురించి తెలిసినవాళ్లు ఆమె ఎప్పుడూ హెయిర్ సెలూన్‌లోనే ఉంటుంది అని అంటుంటారు. ఈ విషయం ఆమెను అడిగితే అవును నేను సెలూన్‌కి బానిస అయిపోయానేమో అనిపిస్తుంటుంది అని చెప్పింది. క్లో ఇప్పటివరకు రెండుసార్లు బ్రెస్ట్ సర్జరీలు చేయించుకుందట. అవెప్పుడూ ఒకే సైజులో ఉండాలన్నది ఆమె కోరిక అట. అందుకే సర్జరీలు అని చెప్పింది. అంతేకాదు దంతాలు తెల్లగా ఉండటానికి తరచుగా వెనీర్స్ చేయించుకుంటూ ఉంటుందట. ఇక ఆమె సర్జరీల లెక్క చూస్తే ముక్కుకి మూడుసార్లు, సీటుకి రెండుసార్లు చేయించుకుందట.
ఆఖరికి మర్మావయవాన్ని డిజైనర్ మర్మావయవంగా మార్పించుకున్నా అని చెప్పింది క్లో. ఇన్ని సర్జరీలు ఎందుకు అని అడిగితే నేను అందాన్ని పెంచుకుంటున్నాను అని అంటోంది. ఆ సర్జరీల వల్ల కొత్తగా కనిపిస్తాను. డిఫరెంటుగా ఉంటాను అంటోంది కూడా. 2010లో సెలెబ్రిటీ షో బిగ్ బ్రదర్‌తో టీవీలో తళుక్కుమంది క్లో ఖాన్. ఓన్లీ ఫాన్స్ ద్వారా ప్రస్తుతం ఆమె బాగానే సంపాదిస్తోందట. ఆ డబ్బుతో ఈ సర్జరీలు చేయించుకుంటోందట.