సలార్ సినిమాలో రాధారమ మన్నార్ పాత్రలో నటించినటువంటి నటి శ్రియ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇదివరకే పొగురు సినిమాలో నటించినటువంటి ఈమె చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ ఈ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాలో ఈమె నటన ద్వారా పెద్ద ఎత్తున ప్రేక్షకులను మెప్పించారు. ఈమె నటనకు అందరూ ఎంతో ఫీదా అవుతున్నారు. ఇక ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడంతో ఈమె పలు ఇంటర్వ్యూలకు కూడా హాజరవుతూ సందడి చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఈమె సలార్ సినిమా గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా శ్రియ రెడ్డి మాట్లాడుతూ ప్రశాంత్ ఈ సినిమా కథతో నా వద్దకు వచ్చినప్పుడు నేను ఈ సినిమా చేయనని చెప్పేశాను కానీ ఆయన మాత్రం స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాతనే మీ అభిప్రాయం చెప్పండి అంటూ చెప్పారు. స్క్రిప్ట్ చదివిన తర్వాత ఎంతో గొప్పగా అనిపించిందని తెలియజేశారు.
ఈ పాత్ర గురించి ప్రశాంత్ నీల్ చెబుతూ నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను మీ పాత్రకు మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి అంటూ చిన్నపిల్లలను ఒప్పించినట్టు నన్ను ఈ సినిమాలో నటించడానికి ఒప్పించారని ఈమె తెలియజేశారు. అయితే ముందుగా ఈ సినిమాలో తన పాత్రను దర్శకుడు రాయలేదని అయితే ఇలాంటి ఒక కథలో లేడీ విలన్ పాత్ర ఉంటే సినిమాకి హైలైట్ అవుతుందన్న ఉద్దేశంతో నా పాత్రను రాసారని శ్రియా రెడ్డి తెలిపారు.
ఇక మొదటి పార్ట్ అర్థం కాలేదు అన్న వాదనలు వస్తున్నాయి అయితే ఈ పార్ట్ ద్వారా మేము కథను మాత్రమే పరిచయం చేసాము పార్ట్ 2 లో అసలు సిసలైన కథ ఉంటుందని , అందులో నా పాత్రకు మరింత ప్రాధాన్యత ఉంది అంటూ ఈ సందర్భంగా శ్రియా రెడ్డి (Sriya Reddy) సలార్ సినిమా గురించి చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.