విక్టరీ వెంకటేష్ హీరోగా కె.రాఘవేంద్ర రావు గారి డైరెక్షన్లో తెరకెక్కిన సూపర్ హిట్ చిత్రం ‘కూలీ నెంబర్ 1’. 1991 జూలై 12న ఈ చిత్రం విడుదలైంది. ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సురేష్ బాబు నిర్మించిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది.ఈ చిత్రంతోనే టబు హీరోయిన్ గా పరిచయమైంది. అంతకు ముందు ఈమె హిందీలో రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించింది. కానీ హీరోయిన్ గా మారిన మూవీ మాత్రం ‘కూలీ నెంబర్1’ అనే చెప్పాలి.
ఈ చిత్రం ఆమెకు బోలెడన్ని అవకాశాలు వచ్చేలా చేసింది. ఇక ఈ చిత్రం విడుదలై 30 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపథ్యంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావుకు స్పెషల్ థాంక్స్ చెబుతూ తన ఇన్ స్టాలో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టింది టబు.ఆమె తన పోస్ట్ ద్వారా స్పందిస్తూ.. “నేను హీరోయిన్ అయ్యి 30 ఏళ్ళు పూర్తయ్యిందంటే నమ్మలేకపోతున్నాను.నా ఈ జర్నీలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ‘కూలీ నెంబర్1’ సినిమాలో నాకు ఛాన్స్ ఇచ్చిన రామానాయుడు, సురేష్ బాబు గారికి అలాగే హీరో వెంకటేష్ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నా కెరీర్ కు సాలిడ్ ఫౌండేషన్ వేసింది ఈ మూవీ. నన్ను పాపా అంటూ ఆప్యాయంగా పిలిచే దర్శకుడు, నా గురువు రాఘవేంద్రరావు గారు నన్ను ఓ స్వప్నంలా తెర పై ఆవిష్కరించారు.ఆయన నాకు ఎన్నో విషయాలు నేర్పించారు. మానవత్వం గురించి, అందం గురించి, టైం సెన్స్ గురించి, లైఫ్ ను ఎంజాయ్ చేయడం గురించి రాఘవేంద్రరావు గారు నేర్పిన పాఠాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. థ్యాంక్యూ గురువుగారు… ప్రణామాలు. మీకు నేనెంతో రుణపడి ఉన్నాను” అంటూ టబు పేర్కొంది.