Tamannaah: ఆ మూవీతో మిల్కీ బ్యూటీ ఆశ తీరుతుందా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోయిన్ల జాబితాలో చేరారు. తెలుగు, తమిళ భాషల్లో స్టార్ స్టేటస్ ను అనుభవిస్తున్న తమన్నాకు కొత్త సినిమా ఆఫర్లు ఎక్కువగా రావడంతో తమన్నా నటించి ఈ ఏడాది విడుదలైన సీటీమార్, మ్యాస్ట్రో సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. తమన్నాకు స్టార్ డమ్ తగ్గిందని నెటిజన్లు కొన్ని ఆధారాలను కూడా చూపిస్తుండటం గమనార్హం. జెమినీ ఛానల్ లో మాస్టర్ చెఫ్ షోకు హోస్ట్ గా చేసే అవకాశం తమన్నాకు రాగా ఊహించని విధంగా తమన్నా ఆ షో నుంచి తప్పుకోవడం,

తమన్నా స్థానంలోకి అనసూయ రావడం చకచకా జరిగిపోయాయి. భోళాశంకర్ సినిమాలో కూడా తమన్నా లేనట్టేనని తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్3, గుర్తుందా శీతాకాలం సినిమాలతో పాటు ఒక హిందీ మూవీ తమన్నా చేతిలో ఉంది. ఎఫ్3 సక్సెస్ అయితే మాత్రమే తమన్నాకు సినిమా ఆఫర్లు పెరుగుతాయి. తమన్నా కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఎఫ్2 తమన్నా సినీ కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటనే సంగతి తెలిసిందే. ఆ మూవీకి సీక్వెల్ కాకపోయినా అవే పాత్రలతో తెరకెక్కుతున్న ఎఫ్3 సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాల్సి ఉంది.

ఎఫ్3 సినిమాలో వెంకటేష్ భార్య పాత్రలో తమన్నా కనిపించనుండగా వరుణ్ తేజ్ భార్య పాత్రలో మెహరీన్ కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తుండగా వచ్చే ఏడాది ఫిబ్రవరి 25వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటం గమనార్హం.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus