కరోనా వైరస్ భారిన పడిన మరో సినీ సెలబ్రిటీ..!

కరోనా.. వైరస్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని గడ గడ లాడిస్తుంది. ఇప్పటికే ఇండియాలో చాలా వరకూ కంపెనీలు మూసివేయబడ్డాయి. ఆర్థిక వ్యవస్థ చాలా దెబ్బ పడింది. ఎంప్లాయిస్ అందరికీ ‘వర్క్ ఫ్రం హోమ్’ ఫెసిలిటీస్ ను ప్రొవైడ్ చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. ఈ వైరస్ కు చిన్నా.. పెద్దా… ? పేదా… గొప్పా..? అనే తేడా లేదు. ఇప్పటికే దీని వల్ల ప్రపంచ వ్యాప్తంగా 10,000 మంది వరకూ చనిపోయారని తెలుస్తుంది. చాలా పాజిటివ్ కేసులు కూడా వచ్చాయి. ఈ ఎఫెక్ట్ సినీ ఇండస్ట్రీ పై కూడా పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికే కొందరు హాంక్స్, రీటా విల్సన్, ఇద్రీస్ ఎల్బా, ఓగ్లా కరిలెంకో, రాచెల్ మ్యాథ్యూస్ వంటి హాలీవుడ్ సెలబ్రెటీలకు ఈ వ్యాధి సోకినట్టు నిర్ధారించారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో హీరోయిన్ కూడా చేరినట్టు తెలుస్తుంది.

‘కామసూత్ర’ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఇందిరా వర్మ కూడా ఈ లిస్ట్ లో చేరిందట. అవును ఈమెకు కూడా కరోనా సోకింది. ఈ విషయాన్ని స్వయంగా ఈమెనే తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. ‘నాకు కరోనా పాజిటివ్ అని తెలియగానే పడకగదికే పరిమితం అయ్యాను. ఇప్పుడు నేను ఒంటరి దాన్నైపోయాను. దీంతో చాలా బాదగా అనిపిస్తుంది. కరోనావైరస్ సోకకుండా మీరంతా తగిన జాగ్రత్తలు తీసుకోండి. మీ చుట్టుపక్కల ఉన్న వారికి తగిన సలహాలివ్వండి’ అంటూ ఈమె తన సోషల్ మీడియాలో పేర్కొంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus