Actress Tulasi: కార్తికేయ 2 విజయంపై నటి తులసి ఎమోషనల్ కామెంట్స్!

ఒక చిన్న సినిమాగా విడుదలయ్యి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం కార్తికేయ 2 గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా కేవలం సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇకపోతే ఈ సినిమా ఊహించిన విధంగా 100 కోట్ల కలెక్షన్లను రాబట్టి 100 కోట్ల క్లబ్లో చేరడంతో కర్నూలులో ఘనంగా వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పెద్ద ఎత్తున సందడి చేశారు.

ఇదిలా ఉండగా ఈ సినిమాలో నిఖిల్ తల్లి పాత్రలో నటించిన నటి తులసి మాట్లాడుతూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ ఒక తల్లి మాత్రమే ఇలాంటి ఆప్యాయతను సంపాదించుకోగలదేమో.. కార్తికేయ 2సినిమా విడుదల కావడంతో దేశం మొత్తం డైరెక్టర్ చందు మొండేటి గురించి మాట్లాడుకుంటుంది అంటూ ఈమె వెల్లడించారు. ఇక ఈ సినిమా చూసిన ఎంతోమంది ఆయన డైరెక్టర్ లేకపోతే లెక్చరరా ఇంత డీటెయిల్ గా సినిమా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేలా చూపించారంటూ ఎంతోమంది ప్రశ్నించారని తెలిపారు.

అయితే మా సినిమా విడుదలకు ముందు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాము. అయితే చిన్న సినిమా అని చాలామంది తేలికగా తీసిపడేసారంటు ఈ సందర్భంగా ఈమె పేర్కొన్నారు. కార్తికేయ సినిమా చిన్నదే కావచ్చు అయితే ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది అని తెలిపారు.

ఎలుక చిన్నదే కావచ్చు కానీ అది రంద్రం చేస్తే దాని నుంచి ఎన్నో బయటకు వెళ్తూ ఉంటాయి.అలాగే ఈ చిన్న సినిమానే నేడు పెద్ద విజయం అందుకుంది అంటూ ఎమోషనల్ అవ్వడమే కాకుండా ఇప్పుడు రండి ఈ సినిమాని ఎవరు ఆపుతారో చూద్దాం అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇకపోతే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా కంటెంట్ ఉంటేనే ప్రేక్షకులు ఆదరిస్తారని మరోసారి ఈ సినిమా నిరూపించిందని చెప్పాలి.

లైగర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘లైగర్’ కచ్చితంగా చూడడానికి గల 10 కారణాలు..!
మహేష్ టు మృణాల్.. వైజయంతి మూవీస్ ద్వారా లాంచ్ అయిన స్టార్ల లిస్ట్..!
‘తమ్ముడు’ టు ‘లైగర్’… బాక్సింగ్ నేపథ్యంలో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus