బిగ్ బాస్5 : సన్నీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఉమ..!

‘కార్తీకదీపం’ సీరియల్ లో అర్ధపావు భాగ్యలక్ష్మీగా ప్రేక్షకులను అలరించిన ఉమాదేవి ‘బిగ్‌బాస్‌5’ లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి మరింతగా పాపులర్ అయ్యింది. అయితే ఈమె ముక్కుసూటితనం వల్లో ఏమో కానీ హౌస్ లో ఎక్కువ రోజులు నిలదొక్కుకోలేక రెండు వారాలకే ఎలిమినేట్ అయిపోయింది. అయితే ఆమె హౌస్ నుండీ బయటకి వచ్చిన రోజు దగ్గర్నుండీ మరో కంటెస్టెంట్ సన్నీకి సపోర్ట్‌ చేస్తూ వస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆమె ‘బిగ్ బాస్5’ కి రాకముందు నుండే సన్నీతో కలిసి సీరియల్‌స్ లో నటించడమే..!

అంతేకాకుండా ఒకానొక టైములో ఉమాదేవి సన్నీని తన ఇంటి అల్లుడిని చేసుకోవాలనుకుందట కానీ ఆమె కూతురి వల్ల ఆమె ఆశలు చెడిపోయినట్టు చెప్పుకొచ్చింది. ఉమాదేవి మాట్లాడుతూ…” ‘కళ్యాణ వైభోగం’ సీరియల్‌ మొదలైనప్పుడు మాకు సన్నీ హీరో అని చెప్పారు.ఆ సీరియల్ లో అతను నాకు మేనల్లుడి పాత్రని పోషించబోతున్నాడు అని తెలిసింది.అయితే సన్నీ ఎవరబ్బా? అని నేను ఆరాతీస్తే నా పెద్ద కూతురు వీజె అని చెప్పింది. ఆ టైములోనే సన్నీకి బోలెడంత మంది ఫాలోవర్స్‌ ఉన్నారు.

ఓ రోజు నేను అతనితో మాట్లాడాను. అబ్బాయి బాగున్నాడు కదా.. మా పెద్దమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని మనసులో ఆశపడ్డాను. కానీ అంతలోనే మా పెద్దమ్మాయి అతనుండగా వచ్చి ‘సన్నీ అన్నా’ అంది.అంతే నా ఆశల పై నీళ్లు జల్లినట్టు అయ్యింది. ఆరోజు నుండీ సన్నీ నా కూతుళ్లను చెల్లెళ్లుగా, వీళ్లు అతడిని అన్నగా ఫిక్సయిపోయారు. నేను అత్తని అవ్వాలనుకుంటే వాళ్ళు పిన్నిని చేసి పడేసారు. నా కూతురు ఆ టైములో అక్కడికి రాకపోయి ఉంటే సీన్‌ మరోలా ఉండేది” అంటూ చెప్పుకొచ్చింది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Share.