టాలీవుడ్లో ‘మైత్రి మూవీ మేకర్స్’ అగ్ర నిర్మాణ సంస్థగా దూసుకుపోతుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు, సీనియర్ హీరోలు అందరూ ఈ సంస్థలో సినిమాలు చేసేశారు. నాగార్జున, వెంకటేష్ తప్ప.. టాలీవుడ్లో ఉన్న మిగిలిన స్టార్ హీరోలంతా సినిమాలు చేసేశారు. వాళ్ళతో కూడా సినిమాలు చేయడానికి ‘మైత్రి’ వారు సన్నాహాలు చేస్తున్నారు.అలాగే పక్క భాషలకు చెందిన స్టార్ హీరోలతో కూడా ‘మైత్రి’ సినిమాలు నిర్మించడానికి రెడీ అయ్యింది.
ఆల్రెడీ అజిత్ తో ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, సన్నీ డియోల్ తో ‘జాట్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించింది. సరిగ్గా ‘మైత్రి’..లానే కన్నడలో ‘హోంబలే ఫిలింస్’ సంస్థ కూడా తక్కువ టైంలోనే అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగింది. కన్నడ పరిశ్రమకు చెందిన సంస్థే అయినప్పటికీ పక్క భాషల స్టార్ హీరోలతో కూడా సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది. ఆల్రెడీ ప్రభాస్ తో ‘సలార్’ చేసింది. ఇప్పుడు ‘సలార్ 2’ తో పాటు మరో 3 సినిమాలు చేయడానికి రెడీ అయ్యింది.అది నిజమే అని ప్రభాస్ కూడా క్లారిటీ ఇచ్చేశాడు.
ఇదిలా ఉంటే.. ‘హోంబలే ఫిలింస్’ అధినేత విజయ్ కిరంగధూర్ ఇప్పుడు మరో సంస్థను స్థాపించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. మిడ్ రేంజ్ సినిమాలు, చిన్న సినిమాల కోసం ఆ బ్యానర్ ను స్థాపించబోతున్నారట. దానిని విజయ్ కిరంగధూర్ కజిన్ టేకప్ చేస్తారని… టాక్ వినిపిస్తుంది. అంటే మన ‘గీతా ఆర్ట్స్’ కి ‘జిఎ2 పిక్చర్స్’.. ‘హారిక అండ్ హాసిని క్రియేషన్స్’ కి ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ మాదిరి అనమాట.