ఓ ఫంక్షన్ లో బన్నీ నాకు లైన్ వేశాడు!
- December 26, 2020 / 01:43 PM ISTByFilmy Focus
కొన్నిరోజులుగా సినీ నటి, కోలీవుడ్ విజయ్ కుమార్ డాటర్ వనితా విజయ్ కుమార్ పలు వివాదాలతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకొని భర్తలతో విడిపోవడమే కాకుండా.. మళ్లీ ప్రేమలో పడ్డానని పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తన కుటుంబ విషయాలు, తండ్రి విజయ్ కుమార్ మోసం చేసిన తీరుని బయటపెట్టి సంచలనం సృష్టించిన ఆమె..
మెగా ఫ్యామిలీతో తనకున్న అనుబంధం గురించి మాట్లాడింది. సినిమా ఇండస్ట్రీ చెన్నైలో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో తమకు చాలా మంది అనుబంధం ఉండేదని.. వాళ్ల ఇంట్లో జరిగే ఫంక్షన్లకు తమ ఫ్యామిలీ మొత్తం వెళ్లే వాళ్లమని చెప్పుకొచ్చింది వనితా. అదే సమయంలో చిరంజీవి నటించిన ఓ ఇంగ్లీష్ సినిమా ఓపెనింగ్ ఫంక్షన్ కి తాను వెళ్లగా.. అక్కడే ఉన్న అల్లు అర్జున్ తనవైపు చూస్తూ లైన్ వేశాడని చెప్పి ఆశ్చర్యపరిచింది.

అయితే ఆ సమయంలో అల్లు అర్జున్ తనకంటే చిన్నవాడని.. ఆయన వయసు 14 ఏళ్లు ఉండొచ్చని చెప్పుకొచ్చింది. కానీ అప్పుడు అతను బన్నీ అని గురించని తనకు కొన్ని రోజుల తరువాత ఆ విషయం అర్థమైందని చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లో బన్నీ సూపర్ డాన్సర్ అని.. ఛాన్స్ దొరికితే ఆయనతో కలిసి నటిస్తానని చెప్పింది. బన్నీకి అత్తగా నటించాలని ఉందని చెప్పుకొచ్చింది.
Most Recommended Video
2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!
















