Vasuki Pakija: పూట గడవని పరిస్థితిలో నటి పాకీజా.. ఆమె మాటలు వింటే కన్నీళ్లు ఆగవు..!

సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.. నటీనటులంటే భారీ పారితోషికాలు, కోరుకున్న జీవితం, నచ్చినట్టు బతికేస్తారు.. వాళ్లకేం తక్కువ అనుకుంటుంటారు కానీ ముఖానికి మేకప్ వేసుకునే వాళ్లూ మనుషులే.. వాళ్ల మనసుల్లో ఉన్న బాధ, కష్టాలు మాత్రం పైకి కనిపించవ్. పరిశ్రమలో ఓ వెలుగు వెలిగి, ఉన్నదంతా పోగొట్టుకుని పూట గడవని పరిస్థితిలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులున్నారు. ఇటీవల నటి పావలా శ్యామలా తను పడుతున్న ఇబ్బందులను, సాయం చేసిన మెగాస్టార్ చిరంజీవి వంటి వారి వివరాలను వెల్లడించారు.

ఆమెలా ఎంతోమంది ఇబ్బందుల్లో ఉన్నారు. సాయం కోసం ఎదురు చూస్తున్నారు. సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుధ కూడా వందల కోట్ల ఆస్తులు కోల్పోవడం, తిండి కూడా లేకపోతే తన తల్లి తాళిబొట్టు అమ్మెయ్యడం గురించి చెప్పడం చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. మీడియా ముందు చెప్తేనే జనాలకు, పరిశ్రమ వర్గాల వారికి ఇలాంటివి తెలుస్తాయి కానీ చెప్పుకోలేక ఆత్మాభిమానం అడ్డు వచ్చి ఇంకా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వాళ్లున్నారు. రీసెంట్‌గా నటి పాకీజా దీన గాధ వెలుగులోకి వచ్చింది.

తమిళనాడు కారైకుడికి చెందిన పాకీజా అసలు పేరు వాసుకి. పాకీజాగా తెలుగు నాట మంచి గుర్తింపు తెచ్చుకున్నారామె. ప్రస్తుతం వయసు పై బడడంతో పాటు పేదరికంతో ఓ హాస్టల్‌లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల కాలంలో సీనియర్ నటీనటులను పలకరిస్తూ.. వారి గురించి ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న పాపులర్ యూట్యూబ్ ఛానల్ సుమన్ టీవీ వారు తాజాగా పాకీజాను ఇంటర్వూ చేశారు. తెలుగులో సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, మోహన్ బాబు, బాలకృష్ణ వంటి టాప్ స్టార్ల సినిమాల్లో నటించారామె. తెలుగులో దాదాపు 50, తమిళ్‌తో కలుపుకుంటే 150కి పైగా చిత్రాలు చేశారు.

‘అసెంబ్లీ రౌడీ’ లో చేసిన పాకీజా క్యారెక్టర్ తర్వాత ఆమె పేరుగా స్థిర పడిపోయింది. ‘పెదరాయుడు’, ‘రౌడీ ఇన్‌‌స్పెక్టర్’ వంటి పలు సూపర్ హిట్ ఫిలింస్ చేసిన పాకీజా సంపాదించిందంతా పోగొట్టుకున్నారు. ఈ సందర్భంగా పాకీజా మాట్లాడుతూ.. ‘‘తెలుగులో 50 సినిమాలు చేశాను. సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్, బాలయ్య, మోహన్ బాబు.. ఇలా అప్పట్లో స్టార్స్ అందరితో సినిమాలు చేశాను.. సినిమాలు ఆపేశాక నా సొంతవూరు కారైకుడికి వెళ్ళిపోయాను.. నటి జయ లలిత తెలుగులో నా బెస్ట్ ఫ్రెండ్..

కొద్ది కాలంగా నా ఆర్థిక పరిస్థితి ఏం బాగోలేదు.. 150 సినిమాలు చేసినా కానీ చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను.. సాయం కోసం తమిళ్ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలనూ సంప్రదించాను.. ఆఖరికి తమిళనాడు సీఎం స్టాలిన్ కుమారుడు, నటుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్‌కి కూడా కలిసి నా పరిస్థితి చెప్పుకున్నాను.. కానీ, ఎవరూ సాయం చేయలేదు.. ప్రస్తుతం హాస్టల్‌లో ఉంటూ కాలం గడుపుతున్నాను.. ఎవరైనా సాయం చేస్తారేమోనని ఎదురు చూస్తున్నాను’’ అని చెప్తూ భావోద్వేగానికి గురయ్యారామె..

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus