న్యాయస్థానం నన్ను గెలిపించింది.. కానీ సోషల్ మీడియా వేధిస్తోంది: యమున

అప్పట్లో పలు హిట్ సినిమాల్లో నటించి టాప్ హీరోయిన్ గా ఎదిగిన యమున.. తర్వాత కొన్ని సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను అలరించింది. తన అందం, అభినయంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఈమె .. 2011లో బెంగుళూరులోని ఓ హోటల్ లో వ్యభిచారం చేస్తూ.. పోలీసులకు పట్టుబడింది అంటూ అప్పట్లో ఓ రేంజ్లో వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ‘తన తప్పేమీ లేదని, వాంటెడ్ గా తనని ఇరికించారని’ ఈమె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

అయినా సరే ఆ విషయం పై ఈమె గురించి ఎన్నో అసభ్యకరమైన వార్తలు వస్తూనే ఉన్నాయి. అవి చూసి తట్టుకోలేక ఓ వీడియో ద్వారా తన బాధను వ్యక్తం చేసింది యమున. ఈ వీడియో ద్వారా యమున మాట్లాడుతూ.. “హాయ్ అండి.. నన్ను నేను ఎంత మోటివేట్ చేసుకున్నా కూడా తెలీని ఓ బాధ అయితే ఉండిపోయింది అండి సోషల్ మీడియా వల్ల. ఎందుకంటే నేను ఓ ప్రాబ్లమ్ నుండి బయటకు వచ్చి ప్రశాంతంగా ఉన్నాను. ఆ ప్రాబ్లమ్ లో నేను ఎందుకు ఇరుక్కోవాల్సి వచ్చిందో ఓ ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చేశాను.

న్యాయస్థానం కూడా నాకు క్లీన్ చిట్ ఇచ్చి నన్ను గెలిపించింది. నేను గెలిచాను లైఫ్ లో..! కానీ సోషల్ మీడియానే నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. రకరకాల థంబ్నెయిల్స్ నా గురించి పెట్టి .. నేను దానికి సంబంధించిన వీడియోను చూడను కానీ ఆ థంబ్నెయిల్స్ మాత్రం నన్ను చాలా బాధపెడుతున్నాయి. ఎంత నేను మోటివేట్ చేసుకున్నా నేను కూడా మనిషినే కదా. తెలీని పెయిన్ వస్తుంది. నేను చనిపోయినా కూడా నన్ను వీళ్ళు వదలరు అనుకుంట.

అప్పుడు కూడా నా గురించి ఇలా రాసి డబ్బులు సంపాదించుకుంటారనుకుంట సోషల్ మీడియా వాళ్ళు. నా ఫ్యామిలీ, ఫ్యాన్స్ కి నేనేంటో తెలుసు వాళ్లకు నా గురించి చెప్పుకోనవసరం లేదు. కానీ తెలీని వాళ్ళు దయచేసి నన్ను దగ్గరుండి చూసిన వాళ్ళను అడిగి నా క్యారెక్టర్ ఏంటో, నా మెంటాలిటీ ఏంటో తెలుసుకోండి. అంతేకానీ సోషల్ మీడియాలో వచ్చేదంతా నిజం కాదు.దయచేసి అర్థం చేసుకోండి. టీవీల్లో కూడా నేనేంటో చూపించారు. వాటిని నమ్మండి. కానీ ఇలా డబ్బుల కోసం, రేటింగ్ ల కోసం చేసే థంబ్నైయిల్స్ ను నమ్మకండి” అంటూ చెప్పుకొచ్చింది.

 

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus