ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపేమున్నది’ అంటూ ఓ పాట ఉన్న సంగతి తెలిసిందే.ఏ.ఎన్.ఆర్, సావిత్రి జంటగా నటించిన ‘తోడికోడళ్ళు’ చిత్రంలోనిది ఈ పాట. నిజానికి ఈ పాట ఏ సినిమాలోదో తెలియకపోయినా చాలా మంది ఈ పాటను పాడతారు. అంత చార్ట్ బస్టర్ సాంగ్ అది. సరే ఇంతకీ ఆ పాట గురించి ఎందుకు చెబుతున్నాను అంటే.. ఏ పనైనా ఆడుతూ పాడుతూ చేస్తుంటే .. ఎటువంటి నొప్పి తెలీదు అని ఆ పాట అర్ధం.
అయితే దానికి సరికొత్త డెఫినిషన్ చెబుతుంది ‘హార్ట్ ఎటాక్’ హీరోయిన్ ఆదా శర్మ. ఆడుతూ పాడుతూ కాదు సరికొత్త పద్దతిలో పనులు ఎలా చెయ్యాలో చెబుతుంది. ముఖ్యంగా సరికొత్త విధానంలో బట్టలు ఎలా ఉతకాలో ఓ వీడియో చేసి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆదా శర్మ. బట్టలు ఉతకడం కూడా ఓ వ్యాయాయం లాంటిదే అని పెద్ద వాళ్ళు చెబుతుంటారు. కానీ మార్షల్ ఆర్ట్స్ పద్దతిలో కూడా బట్టలు ఉతకొచ్చు అని మన నితిన్ హీరోయిన్ చెబుతుంది.
ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఇక తెలుగులో నితిన్ – పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన ‘హార్ట్ ఎటాక్’ చిత్రంతో పరిచయమైన ఆదా శర్మ తరువాత ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ ‘కల్కి’ వంటి చిత్రాల్లో కూడా నటించింది. ఈమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది.
Most Recommended Video
View this post on Instagram
#AdahSharma washing clothes in a different way 👌
A post shared by Filmy Focus (@filmyfocus) on
జ్యోతిక ‘పొన్‌మగల్ వందాల్’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!
ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!