Aadhi Sai Kumar: పులి మేక వెబ్ సిరీస్ తో ఓటీటీ ఎంట్రీ ఇచ్చిన ఆది.. సక్సెస్ అయ్యేనా?

ఆది సాయికుమార్ వారసుడిగా ప్రేమ కావాలి అనే సినిమాతో హీరోగా వెండితెర అరంగ్రేటం చేసి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఈ విధంగా మొదటి సినిమా మంచి విజయం కావడంతో ఆది పలు సినిమా అవకాశాలను అందుకున్నారు. అయితే ఈ సినిమాలో ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వకపోవడంతో ఈయన గత కొంత కాలం నుంచి వెండితెరకు దూరమయ్యారు. తాజాగా ఆది నటించిన శశి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను సందడి చేయలేకపోయారు.

ఈ విధంగా ఈయన నటించిన సినిమాలన్నీ చేదు అనుభవాలను ఎదుర్కోవడంతో సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆది బ్లాక్, క్రేజీ ఫెలో వంటి సినిమా షూటింగులతో బిజీగా ఉన్నారు. ఈ విధంగా ఒకవైపు సినిమా షూటింగ్ లో పాల్గొంటూనే మరోవైపు ఈయన వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే ఎంతోమంది హీరోహీరోయిన్లు ఓటీటీ ఎంట్రీ ఇచ్చి ఇక్కడ కూడా తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు.

ఈ క్రమంలోనే లావణ్య త్రిపాఠి ఆది జంటగా పులి-మేక అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. క్రైమ్ థ్రిల్లర్ కథ నేపథ్యంతో తెరకెక్కుతున్న ఈ వెబ్ సిరీస్ కి చక్రవర్తి రెడ్డి దర్శకత్వం వహించగా, ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ & జీ5 వారు సంయుక్తంగా ఈ వెబ్ సిరీస్ ని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈ వెబ్ సిరీస్ లో సీనియర్ నటుడు సుమన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

 

శనివారం హైదరాబాద్లో ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమాలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు. ఈ పూజా కార్యక్రమానికి దర్శకులు అనిల్ రావిపూడి బాబి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కరోనా సమయం నుంచి పెద్ద ఎత్తున ఓటీటీలకు ఆదరణ లభించింది.ఈ క్రమంలోనే సినిమాలకు పోటీగా వెబ్ సిరీస్ లు తెరకెక్కడంతో ప్రేక్షకులు సైతం వెబ్ సిరీస్ చూడటానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus