అనుమానాలు నిజమయ్యాయి. అంచనాలు మ్యాచ్ అయ్యాయి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, హరీష్ శంకర్ దర్శకత్వంలో దువ్వాడ జగన్నాధం సినిమా ప్రకటన వెలువడినప్పుడే.. ఇది యంగ్ టైగర్ ఎన్టీఆర్ అదుర్స్ కి సీక్వెల్ అనే ప్రచారం మొదలయింది. వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రంలో తారక్ చారి గా నవ్వులు పూయించారు. నరసింహా గా యాక్షన్ చూపించారు. అటువంటి రెండు క్యారెక్టర్స్ తో హరీష్ శంకర్ డీజే స్టోరీని రాసుకున్నారని టాలీవుడ్ వర్గాలు కోడై కూశాయి. ఆ పుకారు ఇప్పుడు నిజమైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న దువ్వాడ జగన్నాధం మూవీ ఫస్ట్ లుక్ రెండు రోజుల్లో రిలీజ్ చేస్తామంటూ చిత్ర బృందం ఈరోజు ప్రీ లుక్ విడుదల చేసింది.
నల్లటి తాడుకు కట్టిన రుద్రాక్ష, విబూది నామాలు, కుంకుమ బొట్టు.. ప్రీలుక్ పోస్టర్ లో కనిపించిన ఎలిమెంట్స్ ఇవి. దీంతో ఇది అదుర్స్ 2 అని సినీ విశ్లేషకులు కన్ఫార్మ్ చేసేసారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీలో బన్నీ బ్రాహ్మణ యువకుడిగా, చార్మినార్ కుర్రోడిగా ద్వి పాత్రాభినయం చేయనున్నట్లు సమాచారం. ఈ రెండు లుక్ లు ఫస్ట్ లుక్ లో ఉంటాయా? ఒకరినే రివీల్ చేస్తారా? అనేది రెండు రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.