Adi Reddy: బిగ్ బాస్ కార్యక్రమం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆది రెడ్డి!

ఆదిరెడ్డి పరిచయం అవసరం లేని పేరు బిగ్ బాస్ రివ్యూ యర్ గాఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగు పెట్టారు. సామాన్య వ్యక్తిగా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లినటువంటి ఆదిరెడ్డి టాప్ 3 కంటెస్టెంట్ గా హౌస్ నుంచి బయటకు వచ్చారు. ఇలా ఒక సామాన్యుడు బిగ్ బాస్ హౌస్ లో టాప్ త్రీ కంటెస్టెంట్ గా ఉండడం ఇప్పటివరకు బిగ్ బాస్ చరిత్రలోనే జరగలేదు.

ఈ విధంగా బిగ్ బాస్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి (Adi Reddy) ఆదిరెడ్డి అనంతరం పలు బుల్లితెర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అలాగే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తనకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇకపోతే తాజాగా ఈయన బిగ్ బాస్ కార్యక్రమం గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. బిగ్ బాస్ సీజన్ సెవెన్ గురించి కూడా ఎప్పటికప్పుడు రివ్యూస్ ఇస్తూ ఉంటానని తెలిపారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమం ఇంకా ప్రసారం కాకుండానే ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అంటూ హైకోర్టు నుంచి నాగార్జునకు అలాగే స్టార్ మా కు నోటీసులు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ విషయంపై కూడా ఆదిరెడ్డి స్పందిస్తూ తన అభిప్రాయాన్ని తెలియజేశారు. బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం కాకనే ఈ కార్యక్రమాన్ని ఆపివేయాలి అంటూ నోటీసులు వస్తున్నాయి అయితే కొందరు ఉద్దేశ పూర్వకంగానే ఇలా చేస్తున్నారని తన అభిప్రాయాన్ని తెలిపారు.

బిగ్ బాస్ కార్యక్రమంలో ఎలాంటి వల్గారిటీ లేదు. నిజం చెప్పాలంటే సినిమాలలోను ఓటీటీలో ప్రసారమవుతున్నటువంటి కొన్ని వెబ్ సిరీస్, కొన్ని కామెడీ షోలలో ఉన్నంత వల్గారిటీ బిగ్ బాస్ లో లేదని ఈ సందర్భంగా ఆదిరెడ్డి తెలిపారు. ఇష్టం ఉన్నవాళ్లు ఈ కార్యక్రమాన్ని చూస్తారు ఇష్టం లేని వాళ్ళు చూడరు. ఇక ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి అంటూ ఈయన బిగ్ బాస్ కార్యక్రమం పై తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

బ్రో సినిమా రివ్యూ & రేటింగ్!

‘బ్రో’ మూవీ తప్పకుండా చూడడానికి గల 10 కారణాలు..!
‘బ్రో’ కి మిక్స్డ్ టాక్ రావడానికి కారణం ఈ 10 మైనస్సులేనట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus