Adi Reddy: ఆ సమస్య కారణంగానే చెల్లికి పెళ్లి చేయలేదు!

బిగ్ బాస్ రివ్యూయర్ గా ఎంతో ఫేమస్ అయ్యి యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతో మంది సబ్స్క్రైబర్లను సొంతం చేసుకున్నటువంటి వారిలో ఆది రెడ్డి ఒకరు. ఈయన ఈ బిగ్ బాస్ రివ్యూస్ ఇస్తూ ఎంతో ఫేమస్ అవ్వడమే కాకుండా సీజన్ 6 కార్యక్రమంలో కంటెస్టెంట్ గా కూడా పాల్గొని ఫినాలే వరకు చేరుకున్నారు. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ గా మారిన తర్వాత ఆదిరెడ్డికి భారీ స్థాయిలో అభిమానులు కూడా పెరిగిపోయారు.

ప్రస్తుతం ఈయన యూట్యూబ్ ద్వారా లక్షల్లో సంపాదిస్తున్నారు. మంచి కారు బంగ్లాలు బిజినెస్ లు అంటూ ఆదిరెడ్డి కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఒకప్పుడు తినడానికి తిండి లేక ఎంతో ఇబ్బంది పడినటువంటి మేము ఇప్పుడు ఈ స్థాయికి చేరుకున్నాము అంటూ ఎంతో గర్వంగా ఆదిరెడ్డి చెప్పుకున్నారు. ఇకపోతే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించినటువంటి ఈయనకు కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

లక్షల్లో సంపాదన బంగ్లాలు కార్లు ఉన్నప్పటికీ మీ చెల్లి నాగలక్ష్మికి ఎందుకు పెళ్లి చేయలేదనే ప్రశ్న ఈయనకు ఎదురయింది. అయితే ఈ ప్రశ్నకు ఆదిరెడ్డి సమాధానం చెబుతూ చాలామంది మీ చెల్లెలకు ఎందుకు పెళ్లి చేయలేదని అడుగుతున్నారు మా చెల్లెలు కంటి చూపు సమస్యతో బాధపడుతుంది. తన చెల్లి కంటి నరాలు పూర్తిగా దెబ్బ తినడంతో ఆపరేషన్ చేసిన తనకు చూపు రాదని డాక్టర్లు చెప్పారు.

ఆమె కేవలం ఐదు శాతం చూపుతో మాత్రమే చూడగలదు ఒకసారి ఇంట్లో ఏ వస్తువులు ఎక్కడ ఉన్నాయి అనేది పరిశీలిస్తే తర్వాత తను కనుక్కోగలరని అలాంటి అమ్మాయిని పెళ్లి చేసే అత్తారింటికి పంపించి అక్కడ ఇబ్బందులు పెట్టడం ఇష్టం లేక తనకు పెళ్లి చేయలేదని తన చెల్లెలు బాధ్యతలని తన భార్య కవిత చూసుకుంటుంది అంటూ ఈ సందర్భంగా ఆది రెడ్డి (Adi Reddy) తెలిపారు.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus