Adipurush: ‘ఆదిపురుష్‌’ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇదేంటంటూ పవన్‌ ఫ్యాన్స్‌ ప్రశ్న!

రూల్స్‌ పెడతాం.. కానీ మాకు నచ్చినప్పుడే పాటిస్తాం!.. ఇదేంటి ఏపీ ప్రభుత్వం గురించి అంటున్నారా? అని అనుకుంటున్నారు. అవును కరెక్టే.. మేం చెప్పబోతోంది ఏపీ ప్రభుత్వం గురించే. అయితే ప్రభుత్వం పథకాలు, వాళ్ల నిర్ణయాల గురించి కాదు. ఎందుకంటే వాటిని చర్చించే వేదిక ఇది కాదు కాబట్టి. ఇక్కడే మేం చెబుతున్నది సినిమాల గురించే. తెలుగు సినిమాలను ఏపీ ప్రభుత్వం ఎలా చూస్తోంది అనే విషయం గురించి. ‘ఆదిపురుష్‌’ సినిమా విడుదల నేపథ్యంలో ఈ విషయం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

గత రెండు రోజులుగా సోషల్‌ మీడియాలో ఓ వార్త వైరల్‌ అవుతోంది. ప్రభాస్‌ (Adipurush) ‘ఆదిపురుష్‌’ సినిమా టికెట్‌ ధరలు పెంచుకోవడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అవకాశం ఇచ్చింది అనేది ఆ వార్తల సారాంశం. అలాగే అదనపు షోలు వేసుకోవడానికి కూడా అవకాశం ఇచ్చారట. దీంతో ‘ఆదిపురుష్’ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వసూళ్లు పెంచుకునే అవకాశం కల్పించినట్లయింది. మామూలుగా అయితే ఇది సినిమా టీమ్‌కు ఆనందం. అంతేకాదు టాలీవుడ్‌కి కూడా.

అయితే గతంలో ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల ప్రకారం ధరలు పెంచాలన్నా, షోలు పెంచాలన్నా ఓ రూల్‌ ఉంది. ఇప్పుడు ‘ఆదిపురుష్‌’కు ఆ రూల్స్‌ ఏవీ వర్తించడం లేదు అంటున్నారు. టికెట్ల ధ‌ర‌ల పెంపు సౌలభ్యం పొందడానికి ‘ఆదిపురుష్’ సినిమాకు ఛాన్స్‌ లేదనేది కొందరి వాదన. ఏడాది క్రితం ప్రభుత్వం పేర్కొన్న నిబంధనల ప్రకారం సినిమాకు రేట్లు పెంచడానికి ఆంధ్రప్రదేశ్‌లో కనీసం 20 శాతం చిత్రీకరణ జరిపి ఉండాలి. ‘ఆదిపురుష్’ సినిమా పూర్తిగా ముంబయిలోని స్టూడియోల్లో చిత్రీకరణ జరుపుకుంది.

దీంతో రూల్స్‌ ఫాలో కాని సినిమాకు ఛాన్స్‌ ఇచ్చారంటూ విమర్శలు వస్తున్నాయి. పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌ అయితే.. ‘పవర్‌ స్టార్‌ సినిమా వచ్చినప్పుడు మాత్రమే రూల్స్‌ గుర్తొస్తాయా’ అని అంటున్నారు. రేప్పొద్దున పవన్ కళ్యాణ్ ‘బ్రో’ సినిమాకు ఈ అవకాశం ఇవ్వరేమో అని విమర్శిస్తున్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అని లెక్కలు, చర్చలు మొదలయ్యాయి.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus