Adipurush: మైథలాజికల్ సినిమాల్లో ఆదిపురుష్ రికార్డులు తిరగరాయనుందా?

ఆదిపురుష్ సినిమా రిలీజ్ కు మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సినిమా థియేటర్లు సైతం ఫైనల్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్ రేట్లతో ఈ సినిమా ప్రదర్శితం కానుంది. ఈ సినిమా బుకింగ్స్ సైతం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని సమాచారం అందుతోంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా బుకింగ్స్ మొదలుకావాల్సి ఉంది. రిలీజ్ రోజునే ఈ సినిమాను థియేటర్లలో చూడటానికి ప్రభాస్ ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు.

ప్రభాస్ ఆదిపురుష్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో దాదాపుగా అన్ని మెయిన్ థియేటర్లలో విడుదలవుతోంది. ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా ఈ సినిమా కలెక్షన్లు మరో లెవెల్ లో ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మైథలాజికల్ సినిమాలలో ఆదిపురుష్ రికార్డులు తిరగరాస్తుందని కొంతమంది చెబుతున్నారు. ఆదిపురుష్ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని వార్ సీక్వెన్స్ లు ఈ సినిమాకు హైలెట్ గా నిలుస్తాయని సమాచారం అందుతోంది.

ఆదిపురుష్ (Adipurush) మూవీ ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందని క్రిటిక్స్ ను సైతం ఈ సినిమా ఆకట్టుకోవడం ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఏకంగా 4 కోట్ల రూపాయలు ఖర్చైంది. ఆదిపురుష్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే సక్సెస్ మీట్ కూడా భారీ రేంజ్ లో చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆదిపురుష్ బాక్సాఫీస్ ను షేక్ చేయడంతో పాటు సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తుందని అభిమానులు కోరుకుంటున్నారు.

ఈ సినిమాకు సంబంధించి వస్తున్న అప్ డేట్లు సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కమర్షియల్ గా కూడా ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. అత్యంత భారీ బడ్జెట్ తో ఆదిపురుష్ మూవీ తెరకెక్కడం గమనార్హం.

టక్కర్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!

అత్యధికంగా రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్లు వీళ్లేనా..!/a>
కలెక్షన్లలో దూసుకుపోతున్న లేడీ ఓరియంటల్ సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus