Adivi Sesh: శేష్ లిస్ట్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్!

టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ‘క్షణం’ సినిమా నుంచి అతడి క్రేజ్ పెరుగుతూ వచ్చింది. హీరోగానే కాకుండా.. రచయితగా తన కథలు తనే రాసుకుంటున్నారు. ఆయనతో సింక్ అయ్యే దర్శకులను ఎన్నుకుంటూ కెరీర్ లో ముందుకు సాగుతున్నారు. ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘మేజర్’ ఇలా వరుస హిట్టు సినిమాల్లో నటిస్తున్నారు. ఇప్పుడు ఆయన నుంచి మరో సినిమా రాబోతుంది. అదే ‘హిట్2’. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు అడివి శేష్. ఇదే సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో తానొక పాన్ ఇండియా సినిమా చేయబోతున్నట్లు వెల్లడించారు. ఇంతకముందు ఇదే బ్యానర్ లో అడివి శేష్ ‘గూఢచారి’ అనే సినిమా చేశారు. అది భారీ విజయాన్ని అందుకుంది. ఈసారి పాన్ ఇండియా లెవెల్ లో మల్టీలాంగ్వేజ్ సినిమా చేయనున్నారు శేష్. అది కూడా అన్నపూర్ణ స్టూడియోస్ లో. ఇదొక యాక్షన్ టచ్ ఉన్న లవ్ స్టోరీ అని వెల్లడించారు అడివి శేష్.

అయితే ఈ సినిమాకి దర్శకుడెవరు..? లాంటి వివరాలను మాత్రం బయటకు చెప్పలేదు. మరోపక్క ‘హిట్ 2’ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయాలనే ఆలోచన కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముందు ఈ సినిమాను తెలుగు వరకే అనుకోని చేశామని.. కానీ హిట్ 2 ప్రోమోలకు హిందీ నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి ఆశ్చర్యం కలిగిందని ..

మొదట డిసెంబర్ 2న తెలుగులో సినిమాను రిలీజ్ చేసి.. ఆ తరువాత హిందీతో పాటు పలు భాషల్లోకి అనువాదం చేసి రిలీజ్ చేస్తామని తెలిపారు. అంతేకాకుండా.. హిట్ 3 కూడా పక్కా ఉంటుందని చెప్పారు. అందులో తాను నటిస్తానని చెప్పారు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus