తక్కువ సమయంలోనే తెలుగులో విభిన్నమైన సినిమాలతో అడివి శేష్ పాపులారిటీని సంపాదించుకున్నారు. రచయితగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అడివి శేష్ అలీతో సరదాగా షోలో ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తాను అమెరికాలో చదువుకున్నానని తన పూర్తి పేరు శేష సన్ని చంద్ర కాగా సన్నీ లియోన్ కు పేరు రావడంతో తాను పేరు మార్చుకున్నానని అడివి శేష్ తెలిపారు. తాను హైదరాబాద్ లోనే పుట్టానని అడివి శేష్ అన్నారు.
మేజర్ సినిమాలో ఊహ ఉన్నా ఇది నిజ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న మూవీ అని అడివి శేష్ అన్నారు. మేజర్ ఉన్నికృష్ణన్ ఎలా బ్రతికారో ఎవరికీ తెలియదని ఆ విషయాలను మేము ఈ సినిమాలో చూపించామని అడివి శేష్ వెల్లడించారు. ఇండస్ట్రీలో భుజం తట్టి ప్రోత్సహించిన హీరోలు చాలామంది ఉన్నారని అడివి శేష్ కామెంట్లు చేశారు. సినిమాల్లోకి రాకపోయి ఉంటే రైటర్ అయ్యేవాడినని అడివి శేష్ అన్నారు. అమెరికాలో భారతీయులకు మంచి రోల్స్ ఇవ్వరని ఆయన తెలిపారు.
భవిష్యత్తులో తలరాతలో ఏది రాసుకుంటే అదే అవుతానని అడివి శేష్ వెల్లడించారు. తాను నటించిన తొలి సినిమా సొంతం అని అడివి శేష్ అన్నారు. ఒక పార్టీలో పంజా సినిమాలో బాగా యాక్ట్ చేశావని రాజమౌళి చెప్పారని అప్పుడు ఛాన్స్ ఇవ్వాలని రాజమౌళిని అడిగితే రెండేళ్ల తర్వాత ఆయన ఛాన్స్ ఇచ్చారని అడివి శేష్ తెలిపారు. బాహుబలి మూవీలో నాకు అమ్మ ఎవరో రాజమౌళిని అడగాలని నేను ఒకసారి అడిగితే ఆయన అనవసరం అని అన్నారని అడివి శేష్ చెప్పుకొచ్చారు.
ఈ మూవీలో భళ్లాలదేవలాంటి దుర్మార్గుడికి నువ్వు పుట్టావని ఆయన అన్నారని అడివి శేష్ తెలిపారు. మేజర్ మూవీ కోసం బాడీ లాంగ్వేజ్, నిలబడే విధానం అన్నీ మార్చుకున్నామని ఆయన చెప్పుకొచ్చారు. అనురాగ్, శరత్ అనే స్నేహితుల ద్వారా మహేష్ కు ఈ కథ చెప్పానని కథ నచ్చి మహేష్ ఈ సినిమాను నిర్మించారని అడివి శేష్ కామెంట్లు చేశారు.