Adivi Sesh: పాన్ ఇండియా సినిమాల గురించి అడివి శేష్ సంచలన కామెంట్స్..!

‘క్షణం’ ‘గూఢచారి’ ‘ఎవరు’ వంటి సూపర్ హిట్ చిత్రాలతో థ్రిల్లర్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారిపోయాడు అడివి శేష్. ఈ ఏడాది వచ్చిన ‘మేజర్’ సినిమా అతనికి పాన్ ఇండియా ఇమేజ్ ను కట్టబెట్టింది. ఈ మూవీ నార్త్ లో కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది. అక్కడ ప్రతి బయ్యర్ సేఫ్ అయ్యాడు. ‘మేజర్’ కు మహేష్ బాబు నిర్మాత కావడంతో బాగా ప్లస్ అయ్యింది.

ఇక ఇప్పుడు నాని నిర్మాణంలో శేష్ చేసిన ‘హిట్2’ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ చేయబోతున్నాడు శేష్. ‘హిట్2’ ప్రమోషన్స్ లో భాగంగా అతను పాన్ ఇండియా రిలీజ్ ల పై అలాగే పాన్ ఇండియా ఇమేజ్ పై స్పందించాడు. ఆ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. అడివి శేష్ మాట్లాడుతూ…. ” ‘హిట్2’ చిత్రాన్ని పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ చేయండని నార్త్ ఆడియన్స్ కోరారు. అందుకే నాని గారితో మాట్లాడి..

పాన్ ఇండియా రేంజ్‌లో ఈ సినిమాని విడుదల చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాం. నాని గారికి, ప్రశాంతి గారికి అందుకు పెద్ద థాంక్స్ చెప్పుకోవాలి. నెక్స్ట్ అన్నపూర్ణ బ్యానర్లో రెండు చిత్రాలు చేయబోతోన్నాను. అవి కూడా పాన్ ఇండియా సినిమాలే. క్షణం ట్రైలర్‌ను మహేష్‌ బాబు గారు రిలీజ్ చేశారు. ఆ తర్వాత ఆయనే నన్ను మేజర్ సినిమాతో పాన్ ఇండియా హీరోగా నిలబెట్టారు. అయితే హిట్2 హిందీ వెర్షన్‌లో కాస్త ఆలస్యంగా రిలీజ్ అవుతుంది.

ఇక్కడ ఉండే ఇండియన్ సినిమాలు చేస్తాను. పాన్ ఇండియా అనేది కథలో ఉండాలి. ఇమేజ్ ఉంది కదా? అని ప్రతి సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయకూడదు” అంటూ అతను చెప్పుకొచ్చాడు.

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus