Star Couple: మరో జంట విడాకులు.. వెంటనే ఇంకొకరితో డేటింగ్!

ఈ మధ్య కాలంలో విడాకుల వార్తలు ఎక్కువగా వింటున్నాం. ఇప్పుడు మరో బాలీవుడ్ జంట విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యింది. బర్క బిష్, ఇంద్రనీల్ సేన్ గుప్తా.. కొంతకాలంగా దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే! అయితే వీళ్ళు తిరిగి కలుస్తారు అని వీరి అభిమానులు ఆశించారు.కానీ అలాంటిదేమీ జరగలేదు. ఈ జంట శాశ్వతంగా విడిపోవాలని భావిస్తున్నట్టు తెలిపి వీరి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బర్క విడాకులు తీసుకోబోతున్నట్లు తెలిపి షాకిచ్చింది.

ఆమె మాట్లాడుతూ.. “నిజమే.. మేము విడాకులు తీసుకోబోతున్నాం.లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతున్నాయి. త్వరలోనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. నా జీవితంలో తీసుకున్న అత్యంత కఠినమైన నిర్ణయమిదే! నేను ఇప్పుడు సింగిల్ మదర్. నా కూతురు మీరాయే నాకు అంతా. ప్రస్తుతం ఓటీటీలో కొన్ని మంచి ప్రాజెక్టుల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాను. టీవీ షోలు, సినిమాల్లో కూడా నటించడానికి రెడీ’ అంటూ చెప్పుకొచ్చింది బర్క. ఇక బర్క, ఇంద్రనీల్.. ‘ప్యార్ కె దో నామ్- ఏక్ రాధ, ఏక్ శ్యామ్’ అనే సీరియల్ తో పాపులర్ అయ్యారు.

2007లో వచ్చిన ఈ సీరియల్ షూటింగ్ టైంలో వీరిద్దరూ (Star Couple) ప్రేమలో పడ్డారు. డ్యాన్స్ షో నాచ్ బలియే ౩వ సీజన్లో కూడా వీళ్ళు కలిసి పాల్గొన్నారు. వీరి మధ్య నెలకొన్న స్నేహం బలపడటంతో 2008 మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లుగా వీరి మధ్య మనస్పర్థలు చోటు చేసుకోవడంతో 2 ఏళ్ళ నుండి విడివిడిగా ఉంటున్నారు. అందుకే ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కూడా రెడీ అయ్యారు. ఇప్పుడు ఈ జంట మరొకరితో డేటింగ్లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతుంది.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus