మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లోని పాటలు మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం.ఆయన సినిమాల్లో పాటలు చాలా బాగుంటాయి. అంత బాగుందటనికి కారణం ఆయనకి మ్యూజిక్ పై ఉన్న ఇష్టం, సందర్భాన్ని సంగీత దర్శకుడికి కరెక్ట్ గా వివరించడం అని అంతా అనుకోవచ్చు. అది సగం నిజమే కానీ విషయం ఇంకా ఉంది. మాటల రచయితగా మాత్రమే కాదు ఆయనకు సాహిత్యం పై కూడా పట్టు ఉంది. అవును త్రివిక్రమ్ లో ఓ లిరిక్ రైటర్ ఉన్నారన్న విషయం ఎక్కువ మందికి తెలీదు.
తాజాగా రిలీజ్ అయిన గుంటూరు కారం గ్లింప్స్ లో వచ్చే బిట్ సాంగ్ రాసింది (Trivikram) గురూజీనే..అన్న సంగతి కూడా ఎక్కువ మందికి తెలీదు.భీమ్లా నాయక్ లో ‘ లాల ..’ సాంగ్ రాసింది కూడా త్రివిక్రమ్. అలాగని అది త్రివిక్రమ్ రాసిన మొదటి పాట అనుకోవడం తప్పే. 20 ఏళ్ళ క్రితమే త్రివిక్రమ్ పాట రాయడం జరిగింది. అదే సినిమాలో అంటే..2003లో రవితేజ, నమిత జంటగా ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై ఒక రాజు ఒక రాణి అనే సినిమా వచ్చింది.
2002 లోనే ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. కానీ రిలీజ్ లేట్ అయ్యింది. ఈ చిత్రానికి యోగి దర్శకుడు. చక్రి సంగీతం అందించారు. ఆ సినిమాలో పాటలు బాగుంటాయి. అందులో స్వరాల వీణ ఈ వేళలోనా అనే అందమైన పాట ఉంటుంది. మాస్ మహారాజ్ రవితేజ ఇమేజ్ ముందు అందులో ఉన్న సాఫ్టు లవ్ స్టోరీ చిన్నదైపోయింది. ఆ సినిమా ఫ్లాప్ అవ్వడంతో త్రివిక్రమ్ పాటలు రాయడం మానేశారు. మళ్లీ 2022 నుండీ మొదలుపెట్టినట్టు తెలుస్తుంది.